ఆ మదర్సా సహనానికి చిరునామా

Update: 2015-12-01 10:43 GMT
దేశంలో అసహనంపై వివాదం చెలరేగుతున్న సమయంలో ఒక మదర్సా సహననికి ప్రతీకగా నిలుస్తుంది.  ఓర్పు,సహనం బోధిస్తు ప్రజలను ఆకట్టుకుంటుంది.  ఆగ్రా శివారులో ఉన్న ఆ మదర్సా సహనాన్ని ప్రబోధిస్తూ... హిందువులు, ముస్లింలు అన్న తేడా లేకుండా రెండు మతాల విద్యార్థులకూ విద్యాబుద్ధులు నేర్పుతూ ఆదర్శంగా నిలుస్తుంది. ఆగ్రా సమీపంలోని మొయిన్ ఉల్ ఇస్లాం మదర్సా ఒక్కటే దేశంలో హిందూ, ముస్లిం విద్యార్థులందరికీ చదువు నేర్పిస్తున్న మదర్సాగా గుర్తింపు పొందింది.  ఇక్కడ తెలుగు - సంస్కృతం - అరబిక్ భాషలలో విద్యాబోధన జరుగుతుంది.  ఆగ్రాకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మదర్సాలో కో ఎడ్యుకేషన్ విధానాన్ని అనుసరిస్తున్నారు.
  
దాదాపు 400 మంది విద్యార్థులు ఇందులో విద్యను అభ్యసిస్తుండగా, వారిలో 150 మంది హిందువులు. వీరంతా కూడా అరబిక్ - ఉర్దు - హిందీ - ఇంగ్లీష్ - సంస్కృతం భాషలలో చదవడం, రాయడంలో ప్రావీణ్యత సంతరించుకున్నవారే.  ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకూ బోధించే ఈ మదర్సాలో కంప్యూటర్ - గణితం - విజ్ణాన శాస్త్రం - సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాలను కూడా బోధిస్తారు. ఈ మదర్సాలో సంస్కృత బోధనను గత నెలలోనే ప్రారంభించారు. తమ విద్యార్థులలో సహనం - నైతిక విలువలు పెంపొందించడమే లక్ష్యమని ఆ మదర్సా ప్రిన్సిపాల్ మౌనాలా ఉజైర్ అలామ్ చెబుతున్నారు.
Tags:    

Similar News