ఇంత అర్జంట్ గా వేలం ఎందుకు: హైకోర్టు

Update: 2020-05-26 09:50 GMT
ఏపీ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.ఆస్తులు అమ్ముకోవడం ద్వారా మాత్రమే ప్రభుత్వం నడపడం.. అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నారా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించినట్టు తెలిసింది.

బిల్డ్ ఏపీ పథకాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటీషన్ ను హైకోర్టు ధర్మాసనం మంగళవారం విచారించింది. వేల కిలోమీటర్లు సముద్ర తీరం ఉన్న ఏపీలో ప్రజలు ధనవంతులు మాదిరిగా ప్రభుత్వం పేదరికంగా ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారని తెలిసింది.

లాక్ డౌన్ అమల్లో ఉండగా ఇంత అర్జంటుగా ఆస్తుల వేలానికి వెళ్లాల్సిన అవసరం ఏంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించినట్టు తెలిసింది. హైకోర్టు తీర్పు ఉత్తర్వుల ప్రకారమే వేలం జరపాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

కాగా కౌంటర్ అఫిడవిట్ కోసం ప్రభుత్వానికి సమయం ఇస్తూ మే 28వ తేదీకి విచారణను వాయిదా వేసింది హైకోర్టు. తిరుమలేషుడి ఆస్తుల వేలంపై గుంటూరు కు చెందిన సురేష్ బాబు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. దీనిపై కూడా ఈరోజు వాదనలు సాగాయి.
Tags:    

Similar News