వైర‌ల్ న్యూస్‌!..2 వేల నోట్ల‌కు ఫుల్ డిమాండ్‌!

Update: 2019-03-12 14:50 GMT
నిజంగానే ఇప్పుడు ఓ న్యూస్ వైర‌ల్‌గా మారిపోయింది. అదేంటంటే... ఏపీలో క‌రెన్సీకి తీవ్ర కొర‌త ఏర్ప‌డింద‌ట‌. మ‌న క‌రెన్సీలో రూ.10 నుంచి రూ.2 వేల నోటు వ‌రకు వివిధ డినామినేష‌న్ల నోట్లు ఉన్నా... వాటిలో చాలా నోట్ల‌కు పెద్ద కొర‌తేమీ లేదట‌. మ‌రి ఇంకే నోటుకు కొర‌త వ‌చ్చిందంటే... ఇంకే నోటండీ బాబూ.. అత్య‌ధిక విలువ క‌లిగిన రూ.2 వేల నోటుకే. నిజ‌మే... ఇప్పుడు ఏపీలో రూ.2 వేల నోటుకు తీవ్ర కొర‌త ఏర్ప‌డింద‌ట‌. అయినా ఇప్ప‌టికిప్పుడు ఆ నోటుకు అంత‌గా కొర‌త ఎందుకు వ‌చ్చిందంటే... ఎన్నిక‌ల‌కు న‌గారా మోగింది క‌దా. నోట్ల‌కు కొర‌తే మ‌రి. అందులోనూ ఇటు అధికార ప‌క్షం టీడీపీతో పాటు విప‌క్షం వైసీపీకి కూడా కీల‌క‌మైన ఈ ఎన్నిక‌లు చాలా కాస్ట్లీగానే జ‌రుగుతాయ‌ని ఇప్ప‌టికే తేలిపోయింది. అధికారం నిలుపుకునేందుకు టీడీపీ, ఈ ద‌ఫా ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాల్సిందేన‌ని వైసీపీ హొరాహోరీగా త‌ల‌ప‌డుతున్నాయి.

ఈ క్ర‌మంలో ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ఆ రెండు పార్టీలతో పాటు కొత్త‌గా తెరంగేట్రం చేస్తున్న జ‌న‌సేన కూడా భారీ ఎత్తున డ‌బ్బు పంపిణీ చేసేందుకు క‌స‌ర‌త్తులు మొద‌లెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆయా పార్టీల అభ్య‌ర్థుల ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత త‌నీఖీల గోల ఎందుకంటూ ఇప్ప‌టికే త‌మ‌కు అవ‌స‌ర‌మైన మేర‌కు త‌మ డెన్ల‌లోకి నోట్ల కట్ట‌ల‌ను త‌ర‌లించేశార‌ట‌. ఇలా డెన్ల‌లోని వెళ్లిన నోట్ల‌లో మెజారిటీ నోట్ల‌న్నీ రూ.2వేల నోట్లేన‌ట‌. చెలామ‌ణిలో ఉన్న రూ.2 వేల నోట్ల‌న్నీ ఇలా డెన్ల‌లోకి వెళ్లిపోతే... ఇక బ‌య‌ట ఏం ఉంటాయి? అందుకే ఇప్పుడు ఏపీలో నోట్ల కొర‌త‌... అది కూడా రూ.2వేల నోటుకు తీవ్ర కొర‌త ఏర్ప‌డింద‌ట‌. మొన్న సాయంత్రం ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన వెంట‌నే నేత‌లంతా అలెర్ట్ అయిపోగా... డెన్ల‌లోకి ఇంకా స‌ర్దుబాటు కాని నోట్ల క‌ట్ట‌ల‌ను ఎలాగోలా త‌ర‌లించేందుకు ముమ్మ‌రంగా య‌త్నాలు సాగుతున్నట్లుగా స‌మాచారం.

ఇలా సేఫ్ డెన్ల‌కు త‌ర‌లిపోతున్న నోట్ల‌కు సంబంధించి నిన్న బెజ‌వాడ‌లో ఏకంగా రూ.90 ల‌క్ష‌ల పైచిలుకు న‌గ‌దు ప‌ట్టుబ‌డింది. ఈ నోట్ల‌లోనూ మెజారిటీ వాటా రూ.2వేల నోట్ల‌దేన‌ట‌. అంటే... ఎన్నిక‌లు ముగిసే దాకా రాష్ట్రంలో రూ.2వేల నోటు బ‌య‌ట క‌నిపించే అవ‌కాశం లేద‌న్న మాట‌. మ‌రి ఎప్పుడు ఈ నోట్ల కొర‌త తీరుతుందంటే... ఇంకెప్పుడు... ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్ కు కాస్తంత ముందుగానే. పోలింగ్‌కు ఓ రెండు, మూడు రోజుల స‌మ‌యం ఉంద‌న‌గా... పార్టీల నోట్ల పంపిణీ షురూ అవుతుంది క‌దా. అప్పుడే.... పార్టీలు, పార్టీ నేత‌ల సేఫ్ డెన్లలో అప్ప‌టిదాకా మ‌గ్గిపోయే నోట్ల క‌ట్ట‌ల నుంచి విముక్తి ల‌భించే రూ.2 వేల నోటు బ‌య‌ట‌కు వ‌స్తుంద‌న్న మాట‌.  అప్ప‌టిదాకా రూ.2వేల నోటుకు ఏపీలో కొర‌తే.

Tags:    

Similar News