ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌లో AI ఎంట్రీ.. బ్రాండ్ల కొత్త స్ట్రాటజీ!
మనకు నచ్చిన ఇన్‌ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఏదైనా ప్రొడక్ట్ బాగుందని చెప్తే వెంటనే కొనేస్తాం కదా.. కానీ, ఇకపై అలా నమ్మే ముందు ఒక్క నిమిషం ఆలోచించాల్సిందే.
మనకు నచ్చిన ఇన్‌ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఏదైనా ప్రొడక్ట్ బాగుందని చెప్తే వెంటనే కొనేస్తాం కదా.. కానీ, ఇకపై అలా నమ్మే ముందు ఒక్క నిమిషం ఆలోచించాల్సిందే. ఎందుకంటే, బ్రాండ్ల ప్రమోషన్ల కోసం ఇప్పుడు కంపెనీలు అసలైన మనుషులకు బదులు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' సృష్టించిన నకిలీ ఇన్‌ఫ్లుయెన్సర్లను వాడుతున్నాయి. నిజమైన కస్టమర్లు రివ్యూ ఇస్తున్నట్లే భ్రమింపజేస్తూ కంపెనీలు సాగిస్తున్న ఈ కొత్త బిజినెస్ స్ట్రాటజీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆ వివరాలు చూద్దాం..
గార్డియన్ ఇన్వెస్టిగేషన్‌లో షాకింగ్ నిజాలు:
యూకేకి చెందిన ప్రముఖ వార్తాపత్రిక 'ది గార్డియన్' చేసిన ఇన్వెస్టిగేషన్‌లో ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి. కంపెనీలు తమ ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేయడానికి ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్లను క్రియేట్ చేస్తున్నాయి. ఇక వాళ్లు నిజంగానే ఆ వస్తువులను వాడుతున్నట్లు, వాటితో తమకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లు వీడియోలు, ఫొటోలు పెడుతున్నారు. చూసే వాళ్లకు వాళ్లు అసలైన మనుషులు కాదనే విషయమే తెలియకుండా బ్రాండ్లు గుట్టుచప్పుడు కాకుండా మేనేజ్ చేస్తున్నాయి.
నియమాలు లేకపోవడమే ప్లస్ పాయింట్:
ఇక ప్రస్తుతం యూకేలో ఇలాంటి ఏఐ అడ్వర్టైజ్‌మెంట్లపై ఎలాంటి కఠినమైన రూల్స్ లేవు. అంటే, ఒక యాడ్‌లో ఉన్నది ఏఐ క్రియేట్ చేసిన బొమ్మ అని కస్టమర్లకు చెప్పాల్సిన అవసరం కంపెనీలకు లేదు. ఇక యూరోపియన్ యూనియన్ మాత్రం వచ్చే ఆగస్టు నుంచి డీప్‌ఫేక్స్, ఏఐ కంటెంట్‌కు ఖచ్చితంగా లేబుల్ వేయాలనే కొత్త రూల్ తెస్తోంది. కానీ బ్రిటన్‌లో ఈ రూల్ వర్తించకపోవడంతో బ్రాండ్లు దీన్ని ఆసరా చేసుకొని వాడుకుంటున్నాయి.
70 శాతం మంది మోసపోతున్నారు:
యూకేకి చెందిన కన్స్యూమర్ గ్రూప్ వాళ్ళు చేసిన సర్వేలో ఒక షాకింగ్ విషయం తెలిసింది. సోషల్ మీడియాలో ఏది నిజమైన వీడియో, ఏది ఏఐ సృష్టించిన డీప్‌ఫేక్ వీడియో అనేది 70 శాతం మంది ప్రజలు గుర్తించలేకపోతున్నారట.. దీనివల్ల వినియోగదారులు సులభంగా మోసపోయే ప్రమాదం ఉందని, స్కామర్ల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఆన్‌లైన్ కంటెంట్‌లో నిజం లేకపోవడం ఆందోళనకరమని వారు చెప్తున్నారు.
టెక్నాలజీ పెరగడం మంచిదే అయినా, ఇలా వినియోగదారులను తప్పుదోవ పట్టించడానికి వాడటం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో ఏది నిజమో, ఏది ఏఐ సృష్టిస్తోందో తెలీని అయోమయంలో కస్టమర్లు పడిపోతున్నారు. ఇక భవిష్యత్తులో కంపెనీలు ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్లను వాడితే 'ఇది ఏఐ కంటెంట్' అని ఖచ్చితంగా డిస్‌ప్లే చేసేలా కఠినమైన రూల్స్ వస్తే తప్ప ఈ డిజిటల్ మాయాజాలానికి అడ్డుకట్ట పడదు అంటున్నారు నిపుణులు..