న్యాయవాదుల హత్యపై ఆగ్రహం హైకోర్టు ..ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ!

Update: 2021-02-18 10:16 GMT
న్యాయవాదుల వామన్ రావు దంపతుల హత్యపై తెలంగాణ మొత్తం అట్టుడికిపోతోంది. పట్ట పగలే నడిరోడ్డుపై లాయర్ల లను హత్య చేయడం సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. టీఆర్ ఎస్ నేతలే హత్య చేశారని విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో న్యాయవాదుల హత్యపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. జంట హత్యల కేసును సుమోటోగా స్వీకరించి, తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది. హత్యపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

న్యాయవాదుల హత్య తీవ్ర గర్హనీయమన్న తెలంగాణ హైకోర్టు, ఈహత్య అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంది. లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తమ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాలని, హత్య కేసులో నిందితులను పట్టుకోవాలని ఆదేశించింది.

 హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతులు బుధవారం దారుణ హత్యకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. వామన్ ‌రావు దంపతులు మంథని నుంచి హైదరాబాద్ ‌కు కారులో వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

రామగిరి మండలం సమీపంలో వీరి కారును మరో కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు అడ్డగించారు. అనంతరం వారిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో దంపతులిద్దరు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అనంతరం వారిని స్థానికులు పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మంథనిలో కుల దేవత గుడి వివాదమే హత్యకు కారణమని సమాచారం.

కులదేవత గుడి కూలితే వామన్ రావ్ కూలిపోతాడు అని కుంటా శ్రీనివాస్ అనే వ్యక్తి హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ ఆడియో క్లిప్ కీలకంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. కుమార్ , చిరంజీవి , దాస్ అనే ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ చేశారు.
Tags:    

Similar News