హై అలెర్ట్: దేశంలో కరోనాకు ఈ రెండు వారాలే కీలకం

Update: 2020-03-16 07:00 GMT
చైనాలో పుట్టిన కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోంది. చిన్నగా పుట్టి రెండో వారం నుంచి పూర్తిగా ఆయా దేశాలను గుప్పిట పట్టి ప్రాణాలు తీస్తున్న ఈ మహమ్మారి ఇప్పుడు భారత్ లో కూడా పుట్టి రెండు వారాలైంది. ఈ రెండు వారాలు ఎంతో కీలకం. ఇప్పుడు కానీ మనం నిర్లక్ష్యం వహిస్తే ఆ కరోనా వైరస్ భారత్ ను కబళిస్తుంది. కోట్ల మంది ఉన్న భారత్ లో ఆ వైరస్ కనుక విస్తరిస్తే ఆపార ప్రాణ నష్టం ఖాయం.

*మూడో వారం నుంచి విస్తరిస్తున్న వైరస్
కరోనా వైరస్ పుట్టుక.. పయనం చాలా ప్రమాదకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చైనాలో పుట్టిన ఈ వైరస్ మొదటి రెండు వారాలు ఒకరిద్దరూ పదుల సంఖ్యకే పరిమితమైంది. ఆ తర్వాత వేల మందికి సోకింది. మూడో వారం నుంచి దీని ఉధృతి పెరిగి నాలుగో వారానికి వేలమందికి సోకుతుందని అధ్యయనంలో తేలింది. న్యూయార్క్ లో మొదటి వారం 2 కేసులు నమోదు కాగా.. రెండో వారం 105, మూడో వారం ఏకంగా 613 మందికి పెరిగింది.

ఇక ఫ్రాన్స్ దేశంలోనూ మొదటి వారం 12 కేసులు నమోదు కాగా.. 2వ వారం - 191, 3వ వారం - 653, 4వ వారం- 4499 కేసులు నమోదయ్యాయి.

ఇక ఇరాన్ లో అయితే కరోనా వైరస్ మరణ మృందంగం వినిపిస్తోంది. అక్కడ 1వ వారంలో కేవలం - 2 కేసులు నమోదయ్యాయి. 2వ వారం - 43, 3వ వారం - 245, 4వ వారం - 4747, 5వ వారం - 12729 కేసులు నమోదయ్యాయి.

ఇక కరోనా వల్ల పూర్తి దిగ్భంధంలోకి వెళ్లిన ఇటలీలో కూడా ఇలానే విస్తరించింది. 1వ వారం- 3 కేసులు నమోదయ్యాయి. 2వ వారం - 152, 3వ వారం - 1036, 4వ వారం - 6362, 5వ వారం - 21157 నమోదయ్యాయి.

స్పెయిన్ దేశంలో 1వ వారం - 8, 3వ వారం - 674, 4వ వారం- 6043 కేసులు నమోదయ్యాయి.

ఇప్పుడు ఇండియాలోనూ అదే పరిణామం చోటుచేసుకోవడం దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. భారత దేశంలో మొదటి వారం - 3 కేసులు నమోదయ్యాయి. రెండోవారం ఆ సంఖ్య 24కు పెరిగింది. 3వ వారం ఏకంగా105 మంది రోగులుకు పెరిగారు. ఇప్పుడు 4వ, 5వ వారాలు దేశంలో అత్యంత కీలకం. అందుకే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అన్నింటికి సెలవులు ఇచ్చేశాయి. కరోనా వ్యాప్తి చెందకుండా మీటింగ్, జనసమూహాలు, జనసమ్మర్థ ప్రాంతాలను ఖాళీ చేశాయి. నిషేధాజ్ఞలు విధించాయి. ఈ రెండు వారాలు ఎవరూ ఇల్లు దాటి బయట అడుగుపెట్టకుంటే కరోనా మనం నియంత్రించవచ్చు. తొందరపడి బయటకు పోతే మాత్రం కరోనా కల్లోలం దేశంలో విస్తరించడం ఖాయం అని శాస్త్రవేత్తలు ఈ లెక్కల ఆధారంగా చెబుతున్నారు.

వచ్చే ఈ రెండు వారాలు భారతదేశానికి కీలకమైనవి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భారత ప్రభుత్వం కోరుతోంది. ఈ అంటువ్యాధి కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి 3వ, 4వ వారాలు కీలక సమయం.వృద్ధులు, పిల్లలను ఎంత వీలైతే అంత దూరంగా ఇంట్లోనే ఉంచితే బెటర్ అని సూచిస్తున్నారు. వారికి సోకితే ప్రాణాలు పోవడం ఖాయమంటున్నారు.

కరోనా వైరస్ పై పోరాటంలో భారతదేశం ఇప్పటివరకు బాగానే చర్యలు చేపట్టింది. ఇప్పుడు కరోనా స్టేజ్ 3 వ దశలో ఉన్నాం. ఈ వైరస్ సామాజిక పరిచయాల ద్వారా సామాజిక సమావేశాలలో వ్యాపిస్తుంది. ఇది చాలా క్లిష్టమైన దశ కాబట్టి ఈ సమయంలో సభలు, సమావేశాలను నిషేధించారు. ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్చి రెండవ వారం మధ్య ఇటలీలో పెద్ద ఎత్తున వైరస్ విస్తరించింది.కేసుల సంఖ్య ప్రతిరోజూ విపరీతంగా వ్యాపించింది. 300 నుండి 10,000 వరకు ఎగబాకింది.. రాబోయే 3 నుండి 4 వారాల వరకు భారతదేశం ఈ దశలో అప్రమత్తంగా ఉండకపోతే వేలల్లో కాకుండా లక్షల్లో కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.. వేల మరణాలు సంభవించడం ఖాయం. కరోనాపై ఈ నెల మనకు కీలకం. అందుకే చాలా కార్యక్రమాలు .. బహిరంగ సభలు ఏప్రిల్ 15 వరకు దేశంలో ప్రభుత్వాలు మూసివేశాయి.

పాఠశాలలు మూసివేసినందున అందరూ హాలీడే ,బయట విహారాలు తగ్గించండి.. కరోనా వ్యాపించడంతో పిల్లలు, వృద్ధులతో కలిసి బయట ప్రాంతాలకు వెళ్లకండి. వివాహాలు, ఫంక్షన్లకు,, పుట్టినరోజు పార్టీలకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది.

మెడికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా ప్రకారం వచ్చే 30 రోజులు చాలా కీలకం. ఏదైనా ముఖ్యమైన పని కోసం ఇంట్లో ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోండి. మాస్కులు, శానిటైజర్ తో కడుక్కోవడం వంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటే భయాందోళన ఉండదు.

వచ్చే ఒక నెల పాటు జాగ్రత్తగా ఉంటే దేశంలోంచి కరోనాను మనం తరిమికొట్టవచ్చు. దీనిపై అవగాహన కల్పించడం ద్వారా బాధ్యతాయుతమైన పౌరులుగా మనం ఉండవచ్చు.


Tags:    

Similar News