కరోనాకు కొత్త లక్షణం .. ఎక్కిళ్లు కూడా ఒక లక్షణమట !

Update: 2020-08-13 00:30 GMT
ప్రపంచాన్నివణికిస్తున్న కరోనాను అరికట్టడానికి ఇప్పుడిప్పుడే వాక్సిన్ మార్గం దొరికింది. అనేక దేశాలు కరోనాను అరికట్టడానికి వ్యాక్సిన్ తయారీలో బిజీగా ఉన్నారు. అయితే, అటు కరోనా వైరస్ కొత్త రూపు సంతరించుకుంటుందని అమెరికా శాస్త్రవేత్తలు అంటున్నారు. మొదట కరోనా లక్షణాల్లో శ్వాస సంబంధిత వ్యాధి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించేవి. ఆ తర్వాతి రోజుల్లో కండ్లు ఎర్రబడటం కావడం కూడా ఒక లక్షణంగా నిపుణులు వెల్లడించారు. తాజాగా , ఆగకుండా ఒకటేమైన ఎక్కిళ్లు రావడం కూడా కరోనా వైరస్ సోకినట్లేనని అమెరికా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. చికాగోకు చెందిన ఓ 62 ఏండ్ల వ్యక్తి నాలుగు రోజులుగా ఎక్కిళ్ల సమస్యతో బాధపడుతున్నాడు. అయితే, అతడిలో కరోనా కు సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. అతన్ని పరీక్షించిన వైద్యులు అతనికి కరోనా సోకింది అని నిర్దారించారు. జ్వరం వచ్చిన తరువాత అతడ్ని చెకప్ కోసం హాస్పిటల్స్ కు తీసుకువచ్చారు. వరుసగా 48 గంటలు ఎక్కిళ్ళు ఆగిపోకపోయే సరికి కరోనాను పరీక్షలు జరుపగా పాజిటివ్ గా తేలింది. దీనితో ఎవరికైనా ఆగకుండా ఎక్కిళ్లు వస్తే కరోనా పరీక్షలు చేపించుకోవాలని తెలిపారు.

ఎక్కువ చలి, జలుబు, కండరాల నొప్పి, నిరంతర తలనొప్పి, గొంతు నొప్పితో వణుకు, వాసన లేదా రుచి తెలియకపోవడం కరోనా లక్షణాలని అమెరికా ప్రభుత్వ అత్యున్నత వైద్య సంస్థ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. జ్వరం, దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటివి కరోనా ఇన్‌ ఫెక్షన్‌ లక్షణాలని తొలుత సీడీసీ చెప్పింది. తాజాగా శాస్త్రవేత్తలు సూచిస్తున్నట్లు ఆగకుండా వచ్చే ఎక్కిళ్లు కూడా కరోనా లక్షణంగా భావించవచ్చని వారు చెప్తున్నారు.
Tags:    

Similar News