నామినేష‌న్ల ప‌ర్వం ముగిసింది.. పేర్ల‌తోనే ప‌రేషాన్‌

ఒకే నియోజ‌క‌వ‌ర్గాల్లో ముగ్గురేసి చొప్పున బ‌రిలో నిలుస్తుండ‌గా.. వారి పేర్లు ఒకే ర‌కంగా ఉంటున్నాయి. దీంతో కీలక పార్టీలకు పేర్ల ప‌రిషాన్ ప‌ట్టుకుంది. ఉదాహ‌ర‌ణ‌కు కొన్నచూస్తే..

Update: 2024-04-29 08:37 GMT

ఏపీలో నామినేష‌న్ల ప‌ర్వం ముగిసింది. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు కూడా అయిపోయింది. ఇక‌, ఉన్న‌వారంతా పోటీలో త‌ల‌ప‌డుతున్న‌ట్టే. అయితే.. ఇక్క‌డే ప్ర‌ధాన పార్టీల‌కు చిక్కులు వ‌స్తున్నాయి. ఎన్నిక‌లు అన‌గానే.. పార్టీల గుర్తుల‌పైనే జ‌రుగుతుంటాయి. అయితే.. ఒక్కొక్క‌సారి అభ్యర్థుల పేర్లు కూడా ప్ర‌భావం చూపుతుంటాయి. పేరును బ‌ట్టి ఓట్లు వేసే వారు కూడా ఉన్నారు. ఒకే నియోజ‌క‌వ‌ర్గాల్లో ముగ్గురేసి చొప్పున బ‌రిలో నిలుస్తుండ‌గా.. వారి పేర్లు ఒకే ర‌కంగా ఉంటున్నాయి. దీంతో కీలక పార్టీలకు పేర్ల ప‌రిషాన్ ప‌ట్టుకుంది. ఉదాహ‌ర‌ణ‌కు కొన్నచూస్తే..

పుంగ‌నూరు: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ సీనియ‌ర్ నేత‌, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి బ‌రిలో ఉన్నారు. అయితే.. ఈ పేరుతో మ‌రో ముగ్గురు పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి, భార‌త చైత‌న్య యువ‌జ‌న పార్టీ(బీసీవై) అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ పోటీ చేస్తున్నారు. బీఎస్పీ నుంచి రామచంద్ర పోటీలో ఉన్నారు.

గుడివాడ‌: వైసీపీ నుంచి కొడాలి శ్రీవెంటేశ్వ‌ర‌రావు పోటీలో ఉన్నారు. ఈయ‌న బ‌ల‌మైన నాయకుడ‌నే సంగ‌తి తెలిసిందే. అయితే.. స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు(శ్రీ ఒక్క‌టే లేదు) పోటీ చేస్తున్నారు.

Read more!

తిరువూరు: ఒక్క‌డ టీడీపీ నుంచి కొలిక‌పూడి శ్రీనివాస‌రావు పోటీలో ఉన్నారు. అయితే.. ఇక్కడ ఇండిపెండెంట్‌గా కొలికి శ్రీనివాసులు పోటీలో ఉన్నారు.

ఎచ్చెర్ల‌: బీజేపీ తరఫున నడుకుదిటి ఈశ్వరరావు కూట‌మి అభ్య‌ర్థిగా రంగంలోకి దిగారు. అయితే.. ఇదే పేరున్న న‌డ‌నూరు ఈశ్వరరావు, నడుపూరు ఈశ్వరరావు నామినేషన్‌ వేశారు. వీరి ముగ్గురు పేర్లు ఒకేలా ఉండడం గమనార్హం.

+ పిఠాపురం: వైసీపీ అభ్య‌ర్థిగా వంగా గీతా విశ్వ‌నాథ్ బ‌రిలో ఉన్నారు. అయితే.. ఇక్క‌డ నుంచి ముగ్గురు మ‌హిళ‌లు స్వ‌తంత్రులుగా రంగంలో ఉన్నారు. వీరి పేర్లు కూడా.. ఇలానే ఉన్నాయి. వంగీపురం గీత, వంగ‌ల గీతావిశ్వ‌నాథ్ పేర్ల‌తో మ‌హిళ‌లు పోటీ చేస్తున్నారు. మొత్తానికి ఇలాంటి వారి పేర్ల‌తో ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థుల‌కు ప‌డాల్సిన ఓట్ల‌లో చీలిక వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News