ఇవి రెగ్యులర్ వానలు కావు.. విచిత్రమైన వెరైటీ వానలట.. ఎలానంటే?

Update: 2020-10-21 05:30 GMT
సాధారణంగా వానలు కురవటానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. అందుకు తగ్గట్లే వానలు కురుస్తుంటాయి. తాజాగా దేశంలో కురుస్తున్న వానలు వాతావరణ శాఖ అధికారుల మెదళ్లకు మేతగా మారాయి. చాలాచిత్రంగా.. అరుదుగా కురిసే వానలు ఇప్పుడు కురుస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి వారు పలు ఉదాహరణలు చెబుతున్నారు. సాధారణంగా రుతుపవనాల కారణంగా.. అల్ప పీడన ద్రోణుల కారణంగా.. తుపానుల ప్రభావంతో కురిసే వానలు ఉంటాయి.

అందుకు భిన్నంగా ఇప్పుడు వానలు కురుస్తున్న ఫార్మాట్ భిన్నంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఉదాహరణకు నైరుతి రుతుపవనాలు అంటే.. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడి..  కేరళ నుంచి గుజరాత్ వరకు వానలు పడితే వాటిని నైరుతి రుతుపవనాలుగా చెబుతాం. అదే విధంగా బంగాళా ఖాతంలో ఏరపడిన తుపానులు.. అల్పపీడతాలతో వానలు కురిస్తే వాటిని ఈశాన్య రుతుపవనాలుగా చెబుతాం.

మరి.. సంబంధం లేని రీతిలో బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న అల్పపీడన ప్రభావంతో సంబంధం లేకుండా ఉన్న అక్కడెక్కడో గుజరాత్ లో వానలు కురవటాన్ని ఏమనాలి? ఎలా చెప్పాలి? అన్నదిప్పుడు ప్రశ్న. గడిచిన 20 ఏళ్లలో ఇలాంటివి కేవలం రెండు సార్లే చోటు చేసుకున్నాయని చెబుతున్నారు. ఇంతకూ ఈ వెరైటీ వానలకు కారణం ఏమిటి? ఎక్కడ తేడా జరుగుతోందని అన్న ప్రశ్నకు సమాధానం శోధిస్తే.. ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి.

రోటీన్ గా వీచే గాలులు.. అవి వీచే దిక్కున కాకుండా వేరే దిక్కున వీయటమే కొత్త తరహా వానలకు కారణమంటున్నారు. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల వేళ.. గాలి వాయువ్యం వైపు వీయాలి. అందుకు భిన్నంగా పశ్చిమంవైపు తిరగటం సమస్యలు ఏర్పడుతున్నట్లుగా చెబుతున్నారు.  అల్పపీడనాలన్ని గుజరాత్ వరకు వెళ్లటం లేదు. కొన్ని మధ్య మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఆగస్టులో సుమారు 5 అల్పపీడనాలు ఏర్పడితే..వాటిలో బలమైనవి ఏమీ లేవు. కొన్ని తెలంగాణ వరకు.. మరికొన్ని విదర్భ వరకు వెళ్లాయి. ఇలా జరిగిన రెండు సందర్భాల్లో2007.. 2020లలో సూర్యుడిపై ఏర్పడే మచ్చలు తక్కువగా ఉన్నప్పుడు కావటం గమనార్హం. అంటే.. వెరైటీ వానలకు సూరీడికి కూడా సంబంధం ఉందా? అన్నది ఇప్పుడు ఆసక్తికర ప్రశ్నగా మారింది. 
Tags:    

Similar News