మూడున్నర గంటలు కురిసిన వానకు ముంబై మునిగింది
ఇప్పటికే కరోనా మహమ్మారికి విలవిలలాడుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరానికి మరో మహా కష్టం వచ్చి పడింది. మంగళవారం కురిసిన భారీ వర్షాలు ఆ నగరాన్ని అతలాకుతలం చేశాయి. కరోనా పుణ్యమా అని.. ప్రస్తుతం ఎక్కువమంది ఇళ్లకు పరిమితం కావటం వల్ల.. ఎక్కువమంది వర్షం కారణంగా చోటు చేసుకునే తిప్పల్ని తప్పించుకున్నారని చెప్పాలి. మంగళవారం ఉదయం మూడున్నర గంటల పాటుకురిసిన వర్షానికి దేశ ఆర్థిక రాజధాని వణికిపోయింది.
పలు ప్రాంతాలు జలయం కాగా.. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయిన పరిస్థితి. మహానగరంలో కీలకమైన ముంబై.. థానే..కల్యాణ్.. డోంబివలి.. మీరారోడ్డు.. వసై.. భయిందర్.. విరార్.. ఫాల్ఘర్.. నవీ ముంబై తదితర ప్రాంతాలు జలాశయాల్ని తలపించేలా ఉండటం గమనార్హం. తక్కువ వ్యవధిలో ఆకాశానికి చిల్లుపడినట్లుగా కురిసిన వర్షాలతో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది.
మూడున్నర గంటల వ్యవధిలో కురిసిన వర్షంతో శాంతాక్రజ్ లో 26.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే.. కోలాబాలో 25.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో.. మహానగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాల్లోని చాలా ఇళ్లల్లోకి నీరు భారీగా చొరబడింది. దీంతో వారంతా తీవ్ర అవస్థలకు గురయ్యారు.
భారీ వర్షం కారణంగా రోడ్డు రవాణాపై తీవ్ర ప్రభావం చోటు చేసుకుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావటంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి. అత్యవసర సేవలు అందించేందుకు లోక్ రైళ్ల రాకపోకలకు అంతరాయం చోటు చేసుకుంది. ఇక.. ఉత్తరాది ఎక్స్ ప్రెస్ మార్గంలో కొండ చరియలు విరిగిపడటంలో వాహన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ భారీ వర్షాల కారణంగా లక్షలాది మంది నగర ప్రజలు తీవ్ర అవస్థలకు గురి కాగా.. ఇద్దరు మరణించినట్లుగా అధికారిక సమాచారం.తాజాగా కురిసిన భారీ వర్షంతో ముంబయి మహానగరం ఉక్కిరిబిక్కిరి అయ్యిందని చెప్పక తప్పదు.