ఇంట్లో వర్షం ..బయట వరద .. భయం గుపిట్లో ముంబై వాసులు

Update: 2020-08-06 12:30 GMT
ముంబై భారీ వర్షానికి అతలాకుతలం అవుతుంది. వరద నీరు పోటెత్తుతోంది. నీళ్లల్లో ముంబై తేలుతోంది. ఎక్కడ చూసినా నీళ్లే కనబడుతున్నాయి.ముంబై మహాసముద్రం సిటీలోకి వచ్చిందా అని అనిపిస్తుంది. కొలాబా ప్రాంతం 46 ఏళ్ళ తరువాత మళ్ళీ దాదాపు పూర్తిగా జలమయమైంది. ఒక్క రోజులోనే ఇక్కడ 331.8 మి.మీ. వర్షం కురిసింది. దీంతో పాటు అనేక ప్రాంతాల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. జలు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో వేలాది వాహనాలు మునిగిపోయాయి. సైకిళ్లు, రిక్షాల నుంచి మొదలుకొని బస్సుల వరకు నీటిలో తేలాడుతున్నాయి. వరద నీటిని బయటకు పంపేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

నైరుతి రుతుపవనాలకు తోడు..అరేబియా సముద్రంలో ఏర్పడిన ద్రోణి కారణంగా…భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైతో పాటు..థాణే, రాయ్ గడ్ జిల్లాలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి.ఇదే పరిస్థితి రెండు రోజుల వరకు ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు ముంబై నగరం వణికిపోతోంది. ఆగకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత 15 సంవత్సరాల్లో ఇంతటి వర్షం కురవడం..ఇదే మొదటిసారి అని వాతావరణ నిపుణులు అంటున్నారు.
వర్షాలతో బాటు గంటకు 80 కి.మీ. వేగంతో పెను గాలులు వీస్తాయని పేర్కొంది.

శాంతాక్రజ్ విమానాశ్రయంలో 162,3 మి.మీ .వర్షపాతం నమోదైంది. ముంబైలో ఈ నెల మొదటి అయిదు రోజుల్లోనే 64 శాతం వర్షపాతం నమోదైనట్టు అంచనా. లోతట్టు ప్రాంతాలు, అపార్ట్ మెంట్ లో నీరు చేరింది. ముంబై జేజే ఆసుపత్రిలోకి భారీగ వరద నీరు వచ్చి చేరింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గత రెండు రోజులుగా శివారు ప్రాంతాల్లో గంటకు సుమారు 107 కి.మీ.వేగంతో భారీ గాలులు వీస్తున్నాయి. సబర్బన్, మెట్రో రైళ్లను పాక్షికంగా పునరుధ్దరించారు. ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సీఎం ఉధ్ధవ్ థాక్రే హెచ్ఛరించారు.


Tags:    

Similar News