ఢిల్లీలో వర్ష బీభత్సం.. కొట్టుకుపోయిన ఇళ్లు

Update: 2020-07-19 12:28 GMT
దేశ రాజధాని ఢిల్లీలో కుంభవృష్టి కురిసింది. వర్ష బీభత్సానికి ఢిల్లీ మురికివాడల్లోని ఇళ్లకు ఇళ్లే వరదలో కొట్టుకుపోయాయి. ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించాయి. మృతదేహాలు కూడా కొట్టుకొచ్చాయి.

ఆదివారం వేకువజామున ఢిల్లీలో భారీ వర్షాలు .. వరదలు బీభత్సం సృష్టించాయి. వర్షం కుండపోతగా కురిసింది. భారీ వర్షాలకు ఇద్దరు దుర్మరణం చెందారు. వరదల్లో పలు వాహనాలు, వస్తువులు కొట్టుకుపోయాయి.

వరద ధాటికి నాలాల వెంట నిర్మించుకున్న పేదల ఇళ్లు క్షణాల్లో కోట్టుకుపోయిన వీడియోలు వైరల్ అయ్యాయి. వరద పోటెత్తడంతో చాలా మంది ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నట్లు తెలుస్తోంది. నాలా వెంట రెండు కిలోమీటర్ల వరకు ఇళ్లు కొట్టుకుపోయాయి.   ఇది వీడియోల్లో రికార్డు కావడంతో వరద బీభత్సం కళ్లకు కట్టింది.

మింట్ బ్రిడ్జ్ సమీపంలో వరదనీటిలో ఓ మృతదేహం తేలుతూ  కనిపించింది. ఆ మృతదేహాన్ని ఓ ట్రక్ డ్రైవర్ దిగా అధికారులు గుర్తించారు.

ఈ ఉదయం నుంచి ఢిల్లీలో వాన దంచికొడుతోంది. ఉత్తర భారతం వైపు రుతుపవనాలు మళ్లాయని.. అక్కడ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Tags:    

Similar News