వార్నింగ్ బెల్ మోగించిన హరీశ్.. వారంలో 4 రెట్లు కేసులు
పరిస్థితులన్ని ఎప్పటిలానే ఉన్నా.. ఒకసారి కరోనా వేవ్ మొదలయ్యాక.. దాన్ని ఆపటం అంత తేలిక కాదు. ఇదే విషయం మొదటి.. రెండో వేవ్ సందర్భంగా స్పష్టమైంది. మూడు.. నాలుగు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైనట్లుగా తెలంగాణ రాష్ట్ర వైద్యాధికారి గడల శ్రీనివాస్ వెల్లడించటం తెలిసిందే. ఆయన మాటలకు తగ్గట్లే.. గడిచిన వారంలో కరోనా పాజిటివ్ కేసులు నాలుగు రెట్లు పెరగటం చూస్తే.. కరోనా థర్డ్ వేవ్ బెల్ మోగినట్లేనని చెప్పొచ్చు. ఆయన అంచనా ప్రకారం ఫిబ్రవరి మధ్య వారానికి కేసులు భారీగా పెరుగుతాయని చెప్పారు. పరిస్థితులు చూస్తుంటే.. అంతకు ముందే కేసులు పెరిగే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. గత వారంలో పాజిటివిటీ రేటు నాలుగు రెట్లు పెరిగిందని.. జాగ్రత్తగా ఉండాలన్నారు. రాష్ట్రం తరఫున కేంద్రాన్ని బూస్టర్ డోసు గురించి చాలా కాలంగా కోరుతున్నామని చెప్పారు. ఈ రోజు నుంచి 15-18 ఏళ్ల పిల్లలకు టీకాలు ఇస్తున్నామని.. నాలుగు వారాల వ్యవధిలో రెండో డోసు టీకా ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అనుసరిస్తున్న రిజిస్ట్రేషన్ విధానాన్ని నాలుగైదు రోజుల వ్యవధిలో మార్పులు చేస్తామన్నారు.
తెలంగాణలో తొలి డోస్ వ్యాక్సినేషను వందశాతం పూర్తి చేయటాన్ని అభినందించారు. ఎలాంటి లక్షణాలు ఉన్నా ఆసుపత్రికి వచ్చి టెస్టులు చేయించుకోవాలని.. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ప్రజలు డబ్బులు వృధా చేసుకోవద్దన్నారు. 21 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్ లు అందుబాటులో ఉన్నాయన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.