• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆయ‌న వ‌య‌సు 68 ఏళ్లు.....

ఆయ‌న వ‌య‌సు 68 ఏళ్లు.. కానీ, ఎంత ఇన్సిపిరేష‌న్ అంటే..!

By - Tupaki Desk
Update: 2022-10-27 04:10 GMT
ఆయ‌న‌కు 68 ఏళ్లు. అంటే.. వ‌యోవృద్ధుడు అన్న‌మాట‌. కానీ, ఆయ‌న వృద్ధాప్యం.. శ‌రీరానికే కానీ, మ‌న‌సు కాద‌ని నిరూపించారు. చదవాలనే కృషి, పట్టుదల ఉంటే వయస్సు ఏమాత్రం అడ్డం కాదని మరోసారి రుజువు చేశారు ఈ 68 ఏళ్ల వ్యక్తి. తన కేసును తానే వాదించుకోవడం కోసం రిటైరైన తరవాత కూడా.. పట్టుదలతో న్యాయశాస్త్రం పూర్తి చేసి అందర్నీ ఔరా అనిపించారు.

న్యాయశాస్త్రం చదివి అందరికీ ఆదర్శంగా నిలిచారు. తన సొంత వ్యాపార కేసులను వాదించుకోవడానికి లా కోర్సు చేశారు. ఆయ‌న‌ పంజాబ్లోని ఓ విశ్రాంత ప్రభుత్వోద్యోగి.

పంజాబ్లోని బఠిండాకు చెందిన ప్రశోత్తం బన్సల్ ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఎన్ఎఫ్ఎల్లో పనిచేస్తూ 2016 లో పదవీవిరమణ పొందారు. అనంతరం 2019లో పంజాబ్లోని బఠిండా విశ్వవిద్యాలయం నుంచి రెగ్యులర్గా 'లా' కోర్సు పూర్తిచేశారు.

బన్సల్కు సొంతంగా కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. వాటిపై న్యాయపరమైన సమస్యలు ఉన్న కారణంగా కోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. మొదట్లో న్యాయపరంగా సరైన అవగాహన లేక కేసుల విచారణ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురుకోవాల్సి వచ్చిందని చెప్పారు బన్సల్. అందుకే తాను న్యాయవిద్య చదివినట్లు తెలిపారు.

'ప్రతీ ఒక్కరూ భారతీయ చట్టాల గురించి తెలుసుకోవాలి. అప్పుడే వారి హక్కులను, అధికారాలను తెలుసుకోగలుగుతారు. న్యాయం పొందడం, హక్కులను తెలుసుకోవడం ప్రతీ ఒక్కరి హక్కు' అని ఆయన అన్నారు. తాను లా కోర్సులో చేరినప్పుడు విద్యార్థులు సహకరించలేదని, క్రమంగా తనతో వారు కలసిపోయారని చెప్పారు బన్సల్.

గతంలో అమ్మాయిలు న్యాయవాద రంగంవైపు వచ్చేవారు కాదని.. ఇప్పుడు పెద్ద సంఖ్యలో అమ్మాయిలు న్యాయవృత్తిని చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. అందుకు తాను సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. సో.. దీనిని బ‌ట్టి తెలిసేదేంటంటే.. వ‌య‌సు అయిపోయింద‌ని అనుకోకుండా.. ఆస‌క్తిని చంపుకోకుండా. ప్ర‌య‌త్నం చేస్తే.. ఏదైనా ఫ‌లిస్తుంద‌నే విష‌య‌మే!!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Punjab 
  • RetiredGovernmentEmployee 
  • Bansal 
  • Bathinda 
  • Court 
  • PoliticalNews 

Similar News

ఏఐ యుగంలో మనుషుల పని మారనుందా? ఉద్యోగాల నుంచి ప్రకృతి, సంస్కృతి వైపు కొత్త ప్రయాణం..

2026-11-23 12:28 GMT

'వ‌ర్మ‌' గారి గుండెల్లో గుబులు.. రీజ‌న్ ఇదే.. !

2026-11-23 11:26 GMT

సిటీకి పోటీగా పల్లెటూళ్లలో పెళ్లిళ్లు.. లక్షల్లో ఖర్చులు!

2026-11-23 11:03 GMT

ప్రేమ కోసం 3,200 కిలోమీటర్ల బైక్ ప్రయాణం.. రేవంత్ రెడ్డి లవ్ స్టోరీలో ఇదే హైలెట్..

2026-11-23 11:03 GMT

'పేపకాయల' వాళ్లు.. కలిసి దుమ్ములేపారు..

2026-11-23 11:02 GMT

ట్రంప్ ప్రేమలేఖను కనీసం కవర్ కూడా చించకుండా వెనక్కి పంపిన కిమ్

2026-11-23 08:10 GMT

పాకిస్తాన్‌తో పాత సంబంధాలు.. భారత్‌తో బలమైన బంధం ఎందుకు? బైడెన్ పుస్తకంలో కీలక వ్యాఖ్యలు

2026-11-23 08:08 GMT

గడ్డమే రేవంత్, కేటీఆర్ లకు అడ్డంగా మారిందా?

2026-11-23 07:03 GMT

చిన్నా పెద్దా ఇష్టపడే ఈ ఫుడ్‌తో గుండెకు ముప్పు!

2026-11-23 05:46 GMT

మిషన్ 2028.. కాదు కాదు మిషన్ 2034.. రేవంత్ రెడ్డి 90 సీట్ల కలల సౌధం

2026-11-23 04:37 GMT

బిస్లరీ వాటర్‌లో రసాయనాలు.. పరీక్షల్లో బయటపడిన లోపాలు

2026-11-23 04:36 GMT

ఎన్విడియా చిప్స్ చైనాకు తరలింపు.. లీ మింగ్ పేరు బయటకు!

2026-11-23 04:35 GMT

Copyright @2026

Powered by Blink CMS