వావ్.. అదిరేలా హార్దిక్ స్టైలిష్ లుక్..ఫ్యాన్స్ ఫిదా

Update: 2020-11-06 08:30 GMT
హార్దిక్ పాండ్యా టీంఇండియాకు ఎంపికైనప్పట్నుంచి ఎప్పటికప్పుడు తన లుక్ ని  స్టైలిష్ గా మార్చుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటోంది ఉన్నాడు.  హెయిర్ స్టయిల్ ప్రతి సారి పాండ్యా మార్చినంతగా మరెవరూ మార్చారేమో. గాయం తో కొద్ది రోజులు క్రికెట్ కు దూరమైన పాండ్యా ఐపీఎల్ టోర్నీలో ఎంట్రీ ఇచ్చాడు. వస్తూ వస్తూనే స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్న హార్దిక్ మరోసారి తన స్టయిల్ మార్చి ఆకట్టుకుంటున్నాడు. క్వాలిఫైయర్ వన్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్​పై ముంబై ఇండియన్స్ తిరుగులేని విజయం సాధించి తన ఆధిపత్యాన్ని నిరుపించుకుని ఫైనల్ కు చేరుకున్న  విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్​కు ముందు బయటకొచ్చిన హార్దిక్ వీడియో చూసి క్రికెట్ ఫ్యాన్స్  ఫిదా అవుతున్నారు.

మ్యాచ్‌ ప్రారంభానికి ముందు హోటల్‌ నుంచి బయలుదేరిన హార్ధిక్‌ పాండ్యా వీడియోను ముంబై ఇండియన్స్​ తమ ట్విట్టర్​ అకౌంట్​లో పోస్ట్​ చేసింది. ఈ వీడియోలో పాండ్యా డిఫరెంట్​ లుక్​లో దర్శనమిచ్చాడు.  అతడు వస్తున్నప్పుడు ఐపీఎల్‌ 2020 థీమ్‌ సాంగ్‌ 'దునియా హలా దేంగే హమ్‌' అంటూ బ్యాక్‌గ్రౌండ్‌ లో వినిపించారు. ఆ పాట లిరిక్స్‌ తగ్గట్టూ పాట పాడుకుంటూ హార్దిక్‌ ఉత్సాహంగా కనిపించాడు. హోటల్‌ బయటకు రాగానే సిబ్బంది ముంబై ఇండియన్స్​ జెండాలు పట్టుకొని స్వాగతం పలికారు.  తమ టీమ్‌ కు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ పాండ్యా 'లోహా జాలా దేంగే' థమ్సప్‌ సింబల్‌ చూపించాడు. ఇప్పటికే ఐపీఎల్ 2020లో హార్థిక్​ దూసుకు పోతున్నాడు. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌ లాడిన పాండ్యా 174 స్ట్రైక్‌రేట్‌ తో 241 పరుగులు చేశాడు.
Tags:    

Similar News