షాకింగ్: ఎమ్మెల్యే దంపతుల పై లైంగికవేధింపుల కేసు

Update: 2020-09-06 07:30 GMT
అధికార పార్టీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదు కావాలంటే చాలా కష్టం. అధికారం చేతుల్లో ఉంటుంది. పోలీసులు వారి వైపే. ఎవ్వరు వచ్చినా బెదిరించో బతిమాలో కేసులు లేకుండా చేసుకుంటారు. కానీ ఓ బాధితురాలి పోరాటం ఇన్నాళ్లకు ఫలించింది. బీజేపీ ఎమ్మెల్యేతోపాటు ఆయన భార్యపై కూడా లైంగిక వేధింపుల కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే మహేష్ నేగి, ఆయన భార్య పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేయాలని డెహ్రాడూన్ అదనపు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. అంతేకాదు.. వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని పోలీసులను కోర్టు ఆదేశించడం ఆ రాష్ట్రంలో తీవ్ర సంచలనమైంది.  

కాగా కేసు విషయానికి వస్తే.. ఎమ్మెల్యే తనతో రెండేళ్లుగా శారీరక సంబంధం పెట్టుకున్నాడని.. తన కుమార్తె డీఎన్ఏ తన భర్త డీఎన్ఏతో సరిపోలడం లేదని.. ఎమ్మెల్యే డీఎన్ఏతో పరీక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేతో ఎఫైర్ పై ఒక వీడియోను విడుదల చేశారు. ఇక ఎమ్మెల్యే భార్య కూడా డబ్బులిచ్చి బాధితురాలిని మేనేజ్ చేయాలని చూసింది..

దీంతో బాధితురాలి అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే, ఆయన భార్యపై కేసు నమోదు చేయాలని కోర్టు తెలిపింది.
Tags:    

Similar News