ఈసారి లిమిటెడ్ హజ్ అంటూ షాకిచ్చిన సౌదీ

Update: 2020-06-23 03:45 GMT
జూన్ చివరికి వచ్చేసరికి హజ్ హడావుడి మొదలవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది సౌదీకి ప్రయాణానికి సిద్ధమవుతుంటారు. జీవితకాలంలో ఒక్కసారైనా మక్కాను సందర్శించుకోవాలన్న తలంపు ప్రతి ముస్లింలోనూ ఉంటుంది. అయితే.. అనకున్నంతనే వెళ్లిపోయే అవకాశం ఉండదు. అందుకు తగ్గ ప్రోసీజర్ చాలానే ఉంటుంది.  ఇదిలా ఉంటే.. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఈ జులైలో షురూ చేయాల్సిన హజ్ యాత్రకు సంబంధించి సౌదీ సర్కారు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

మహమ్మారి భయాందోళనలు ఉన్నప్పటికీ హజ్ కు ఓకే చెప్పిన సౌదీ సర్కారు.. ఒక చిన్న ట్విస్టు ఇచ్చింది. సౌదీలో ఉన్న వారికి మాత్రమే ఈసారికి హజ్ కు అనుమతిస్తామని చెప్పింది. అందుకు నియమనిబంధనలు తెలియజేస్తామని స్పష్టం చేసింది. సౌదీ పాలకుల తాజా ప్రకటనతో స్పష్టమయ్యేదేమంటే.. ఈ ఏడాదికి విదేశాల నుంచి హజ్ కు రావాలనుకున్న ఎవరిని అనుమతించరు.

ముస్లింలు అత్యంత ప్రవిత్రమైన కార్యక్రమం గా భావించే హజ్ యాత్ర కు ఏటా 20 లక్షల మందికి పైనే పాల్గొంటారు.దాదాపు నలభై రోజుల పాటు సాగే ఈ పవిత్ర యాత్రకు ఏ దేశం నుంచి ఎంతమంది రావాలన్న అంశం పై సౌదీ ముందే చెబుతుంది. ఇదిలా ఉంటే.. ఈసారి మాత్రం సౌదీలో నివసించే వారిలో ఏ దేశానికి చెందిన వారు ఎంత మంది పాల్గొనాలన్న విషయాన్ని సౌదీ అధికారులు నిర్ణయించనున్నారు.
Tags:    

Similar News