జుట్టు రాలుతోందా? కరోనా కొత్త లక్షణాలివీ

Update: 2020-08-05 23:30 GMT
కరోనా వైరస్.. ఇన్నాళ్లు ముక్కు, నోరు, కళ్ల ద్వారా వ్యాపిస్తుందని తేలింది. అలాగే పిత్తడం ద్వారా కూడా విస్తరిస్తుందని పరిశోధనల్లో తేలింది. దగ్గు, జ్వరం, తలనొప్పి, విరేచనాలు, నీరసం, శ్వాసలో ఇబ్బందులు కరోనా లక్షణాలుగా ఉన్నాయి. ఇప్పుడు తాజా పరిశోధనలో జుట్టు రాలడం కూడా కరోనా వైరస్ లక్షణాలుగా గుర్తించారు.

ఇండియానా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ కు చెందిన వైద్యులు చేపట్టిన పరిశోధనలో 98 రకాల కరోనా లక్షణాలను గుర్తించారు. 1500 కరోనా పేషంట్లపై పరిశోధించారు. తీవ్రమైన నరాల నొప్పి, ఏకాగ్రత సమస్యలు, నిద్ర సమస్యలు.. చూపు మందగించడంతోపాటు జుట్టు రాలడం కూడా కొత్తగా సమస్యగా గుర్తించారు.

మూడో వంతు కరోనా పేషంట్లలో జుట్టు రాలిపోవడం కూడా గుర్తించినట్టు సర్వేలో తేలింది. 75శాతం జట్టును కరోనా రోగులు కోల్పోయారని తేలింది. తాజా అధ్యయనంలో జుట్టు రాలడం వంటి కొత్త లక్షణాలు వెలుగులోకి రావడం విశేషం.
Tags:    

Similar News