జీవీఎల్ కొబ్బరికాయ కొట్టేసి.. సోమును ఇరికించేశారా?
ఏపీ బీజేపీ విషయంలో చిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అంతో ఇంతో పార్టీ పుంజుకు నేలా వ్యవహరిస్తోంది.. అనుకుంటున్న సమయంలో పిడుగుల్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నా యి. దీంతో అప్పటి వరకు పార్టీ చేసిన ప్రయత్నాలు, పుంజుకునేందుకు వేసిన వ్యూహాలు నీటి పాలవుతు న్నాయనే భావన కలుగుతోంది. రాష్ట్రంలో ప్రధానంగా రాజధాని విషయం హాట్ టాపిక్‌గా ఉంది. అమరావ తినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు, ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. పైకి కనిపించకపోయినా.. విజయవాడ, ప్రకాశం జిల్లాలోని ప్రజలు కూడా రాజధానిగా అమరావతినే కోరుతు న్నారు.
అయితే.. ఈ విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్నతీరుపై వారు ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా ఏపీ బీజేపీ నేతలు ఏం చేస్తారని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఈ సయమంలోనేమాజీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ.. నిత్యం రాజధాని గ్రామాల్లో పర్యటించేవారు. రైతులకుఅండగా నిలిచేవారు. రాజధాని ఎట్టి పరిస్థితిలోనూ తరలిపోదని భరోసా ఇచ్చేవారు. దీంతో ఇక్కడి ప్రజలు విశ్వసించారు. అయితే.. ఆ సమ యంలో జోక్యం చేసుకున్న పార్టీ సీనియర్ నేత, ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. రాజధానికి-కేంద్రానికి సంబంధం లేదని వాదించారు. ఈ విషయంలో ఇరువురు నేతల మధ్య ఢీ అంటే ఢీ అనేలా కామెంట్లు కూడా వెలుగు చూశాయి.
ఇక, ఇప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు కూడా కొన్ని రోజుల కిందట రాజధాని గ్రామా ల్లో పర్యటించారు. అక్కడి రైతులకు భరోసా ఇచ్చారు. తాము కూడా రైతుల వెంటే ఉంటామని చెప్పారు. దీంతో మరోసారి రైతులు.. సోము వ్యాఖ్యలను విశ్వసించారు. కానీ, ఇంతలోనే ఏమైందో ఏమో.. అవసరం లేకున్నా.. జీవీఎల్.. కల్పించుకున్నారు. తాజాగా ఆయన రాజధాని విషయాన్ని ఢిల్లీలో ప్రస్తావించారు. ``కేంద్రానికి, రాజధానికి సంబంధం లేదు. ఎవరో ఏదో చెబుతుంటే.. వారిని విశ్వసించవద్దు`` అంటూ.. అమరావతి రైతులను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు సంధించారు. ఈ పరిణామం.. మరోసారి.. ఏపీ బీజేపీ రాజకీయాలను అనూహ్యంగా యూటర్న్ తిప్పేసింది.
ఇప్పటి వరకు అటు కన్నా నుంచి సోము వీర్రాజు వరకు. బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తుంటే.. జీవీఎల్ మాత్రం అడ్డుపుల్లలు వేస్తున్నారనే భావన పార్టీలోనే వినిపిస్తుండడం గమనార్హం. నిజానికి కేంద్రం భావన ఏంటో.. హైకోర్టులో అఫిడవిట్ రూపంలోనే బట్టబయలైంది. అయినప్పటికీ.. ఏదో ఒక రూపంలో కేంద్రాన్ని ప్రసన్నం చేసుకునేందుకు రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీజేపీ పుంజుకునేలా అటు కన్నా.. ఇటు సోములు ప్రయత్నిస్తున్నారు. అయితే.. జీవీఎల్ మాత్రం.. తగుదునమ్మా! అంటూ.. ఇలాంటి కామెంట్లు చేయడం సందర్భం లేకుండానే రాజధానిపై విమర్శలు చేయడం చూస్తే... పార్టీలో కీలక నేతలపై విశ్వసనీయతను పోగొడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతుండడం గమనార్హం.