అమెరికాలో కాల్పుల మోత: ఐదుగురిని చంపి నిందితుడు ఆత్మహత్య

Update: 2020-02-27 07:20 GMT
అమెరికాలో తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట పడడం లేదు. అగ్రరాజ్యం లో ఎక్కడో ఓ చోట కాల్పులు జరిగడం.. అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలవడం సర్వసాధారణమైంది. తాజాగా అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఓ బీర్ల కంపెనీ ఉద్యోగి తోటి ఉద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఐదుగురు మృతిచెందారు. అనంతరం తనను తాను అదే గన్ తో కాల్చుకుని నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం  అమెరికాలోని మిల్‌వాకీలో చోటుచేసుకుంది.

అమెరికాలోని మిల్ వాకీలో ఉణ్న మోల్‌సన్‌ కూర్స్‌ బ్రివరీస్‌ కంపెనీ ఉంది. ఈ కంపెనీ లో పనిచేసే 51 ఏళ్ల ఉద్యోగి మిల్‌వాకీలోని మోల్‌సన్‌ కూర్స్‌ బ్రివరీస్‌ కాంప్లెక్స్‌లోకి బుధవారం సాయంత్రం  ప్రవేశించాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న గన్‌ తో అక్కడ పనిచేస్తున్న తోటి ఉద్యోగులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతిచెందారు. కొద్దిసేపటి తర్వాత నిందితుడి తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అయితే కాల్పులకు గల కారణాలు తెలిశాయి. అతడు గతంలో ఇదే సంస్థ ఉద్యోగి. ఇటీవల అతడిని సంస్థలో నుంచి తొలగించడంతో అక్కసు పెంచుకున్నాడు.

దీంతో సంస్థపై కోపంతో బుధవారం సాయంత్రం ఒకరి ఐడీ కార్డు దొంగలించి కార్యాలయంలోకి ప్రవేశించి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఐదుగురు అమాయకులను పొట్టన బెట్టుకున్నాడు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సంఘటనను ఎంతో క్రూరమైనదిగా తెలిపారు.
Tags:    

Similar News