ఆన్‌ లైన్‌ లో నిశ్చితార్థం..వైరల్ అవుతోన్న వీడియో!

Update: 2020-02-14 04:11 GMT
వచ్చేది పోయేకాలం కాకపోతే ..ఆన్ లైన్ లో నిచ్చితార్థం ఏంటి చెప్పండి. ఇంకా నయం ఆన్ లైన్ లో  నిచ్చితార్థం ..స్కైప్ లో పెళ్లి చేయలేదు. త్వరలో ఆ రోజులు కూడా వస్తాయోమో మరి. అప్పుడు కాపురాలు కూడా వాట్సాప్ , ట్విట్టర్లో చేయాల్సి వస్తుందేమో. ఇకపోతే ఈ మధ్య కాలంలో అన్ని పనులు ఆన్ లైన్ లోనే అయిపోతున్నాయి. తినే తిండి దగ్గర నుండి కావాల్సినవి అన్ని కూడా ఆన్ లైన్ లోనే ఆర్డర్ పెట్టు తెప్పించుకోవడం బాగా అలవాటుగా మారి పోయింది. చివరికి మనుషులపై  ప్రేమాను రాగాలు సైతం ఆన్‌ లైన్‌ లోనే చూపిస్తున్నారు. వ్యక్తులను ప్రత్యేక్షం గా కలుసుకోవడం మానేసి వీడియో కాల్‌ , మెసేజ్ ల ద్వారా మాట్లాడుకున్నారు.

అయితే , దీనికి మించిన కళాకాండం ఇది. గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబం ఆన్‌లైన్‌లో నిశ్చితార్థం చేసుకున్న వీడియో సోషల్ మీడియా లో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాలు చూస్తే ...వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన రెండు కుటుంబాలు తమ పిల్లలకి భారతీయ సాంప్రదాయ పద్దతిలో వివాహం చేయాలనుకున్నారు. దీనిలో భాగంగా నిశ్చితార్థ వేడుకకి ఒక తేదిని కూడా ఫిక్స్‌ చేశారు. కానీ వేరు, వేరు దేశాల్లో ఉన్నా అమ్మాయి, అబ్బాయి ఆ తేది నాటికి గుజరాత్‌ రాలేకపోయారు. దీనితో ఏమిచేయాలో  పాలుపోని కుటుంబ సభ్యులకు చటుక్కున ఓ ఆలోచన వచ్చింది. అదే ఆన్‌ లైన్ ఎంగేజ్‌ మెంట్.

ఈ విషయాన్ని వారికి చెప్పడంతో వారు కూడా ఓకే అనేశారు. దీంతో ముహూర్తం రోజున ఇరు కుటుంబాల వారు వధూవరులకు వాట్సాప్‌లో వీడియో కాల్ చేశారు. అనంతరం రెండు ఫోన్లను పీటలపై పెట్టి సంప్రదాయ బద్ధంగా నిశ్చితార్థం జరిపించారు. అమ్మాయి, అబ్బాయికి ఫోన్‌లోనే తిలకం దిద్ది కొత్తబట్టలు చూపించారు. అనంతరం అక్ష౦తలు వేసి దీవించారు.  ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.  అయితే , ఈ వీడియో పై నెటిజన్స్ రక రకాలుగా స్పందిస్తున్నారు..అయితే ఈ కుటుంబం ప్రారంభించిన ఆన్ లైన్ నిచ్చితార్థం ..వచ్చే రోజుల్లో జోరుగా సాగుద్ది అని కూడా మాట్లాడుకుంటున్నారు.
Tags:    

Similar News