గోద్రా రైలు ఘ‌ట‌నః11 మంది మ‌ర‌ణ శిక్ష మార్పు

Update: 2017-10-09 07:51 GMT
దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన గోద్రా రైలు దహనం కేసులో గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. గ‌తంలో మ‌ర‌ణ‌శిక్ష ప‌డిన వారి శిక్ష‌ను మార్చింది. ప్రత్యేక కోర్టు 11 మంది దోషులకు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ ఈ రోజు తీర్పు వెలువరించింది. ప్రత్యేక కోర్టు 11 మందికి మరణశిక్ష - 20 మందికి జీవిత ఖైదు విధిస్తూ గతంలో తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై శిక్షపడిన వారు హైకోర్టును ఆశ్రయించగా మరణశిక్ష పడిన వారి శిక్షను తగ్గిస్తూ గుజరాత్ హైకోర్టు తీర్పు వెలువరించింది. మరణ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తు తీర్పు వెలువరించింది.

2002, ఫిబ్రవరి 27న గోద్రాలో సబర్మతి ఎక్స్‌ ప్రెస్ ఎస్-6 బోగీని దగ్ధం చేసిన విషయం విదితమే. ఈ ఘటనలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది అయోధ్య నుంచి తిరిగి వ‌స్తున్న క‌ర‌సేవ‌కులే. బోగీ దగ్ధం అనంతరం గుజరాత్‌ లో చెలరేగిన అర్లర్ల కారణంగా సుమారు వెయ్యి మందికి పైగా మృతి చెందారు. 2011లో ప్రధాన నిందితుడు మౌల్వీ ఉమర్జీతో పాటు 63 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. 31 మందిని దోషులుగా ప్రకటించి.. ఇందులో 11 మందికి ఉరిశిక్ష విధించింది. మరో 20 మందికి జీవితఖైదు విధించింది కోర్టు. ఉరిశిక్ష విధించిన 11 మంది దోషులకు జీవిత ఖైదు విధిస్తూ గుజరాత్ హైకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. శాంతిభద్రతలను కాపాడటంలో గుజరాత్ ప్రభుత్వం విఫలమైందని కోర్టు పేర్కొంది.
Tags:    

Similar News