జనసేనలో పెరిగిపోతున్న గందరగోళం
రోజురోజుకు జనసేనలో గందరగోళం పెరిగిపోతోంది. మిత్రపక్షమైన బీజేపీ తమకు కనీస మర్యాద కూడా ఇవ్వటంలేదని తేలిపోవటంతో ఏమి చేయాలో అర్ధం కావటం లేదు జనసేన నేతలకు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీనే పోటీ చేస్తుందని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటనతో జనసేన నేతలకు దిక్కుతోచటం లేదు. ఈ పరిస్ధితుల్లో బీజేపీతో కలిసి ముందుకెళ్ళలేకపోతున్నారు అలాగని మిత్రపక్షాన్ని మనస్పూర్తిగా కలవలేకపోతున్నారు. ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో అప్పటి నుండే జనసేనే కాకుండా పవన్ కూడా చీపైపోయారు.
ఏ విషయంలో కూడా కమలం పార్టీ మిత్రధర్మాన్ని పాటించటం లేదని జనసేన నేతలు ఎంత మొత్తుకుంటున్నా పవన్ మాత్రం నోరిప్పి అడగలేకపోతున్నారు. పేరుకే రెండుపార్టీలు మిత్రపక్షాలు కానీ ఏ ఒక్క కార్యక్రమంలో కూడా రెండు కలిసింది లేదనే చెప్పాలి. ఇటవీల కురిసిన భారీ వర్షాలు, నివర్ తుపాను నష్టాల పరిశీలన విషయంలో కేవలం పవన్+జనసేన నేతలు మాత్రమే పర్యటించిన విషయం తెలిసిందే. అలాగే పవన్ కర్నూలు జిల్లాకు వెళ్ళినా వైజాగ్ లో పర్యటించినా బీజేపీ నేతలకు ఆహ్వానం లేదు.
ఇక బీజేపీ విషయానికి వస్తే అనంతపురం జిల్లాలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటించినపుడు జనసేన నేతలకు సమాచారం లేదు. అంతకుముందు అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్ధానం ఆలయం రథం తగలబడిన ఘటన తర్వాత జరిగిన తర్వాత బీజేపీ ఒంటరిగానే ఆందోళనలు చేసింది. ఇలా ఏ కార్యక్రమం చూసుకున్నా రెండు పార్టీలు దేనికదే వేర్వేరుగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
ఆమధ్య జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో ప్రచారానికి రమ్మని బీజేపీ నేతలడిగితే పవన్ వెళ్ళలేదు. మొన్నటికిమొన్న గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారానికి పవన్ రెడీ అయినా బీజేపీ నేతలు దూరంగా పెట్టేశారు. మొత్తానికి ఒకటిరెండు అంశాలను వదిలేస్తే మిగిలిన చాలా సందర్భాల్లో పవన్ను బీజేపీ నేతలు లెక్క చేయటం లేదని అర్ధమైపోతోంది. తనకు కూడా విషయం స్పష్టంగా అర్ధమైపోతున్నా పవన్ ఏమీ చేయలేని పరిస్దితుల్లో ఉన్నారు.
ఇటువంటి నేపధ్యంలోనే తమంతట తాముగా బీజేపీ మిత్రత్వాన్ని జనసేన వదులుకోలేదు. అలాగని కనీస మర్యాద కూడా ఇవ్వని కమలంపార్టీతో కలిసి నడవలేకుండా ఉంది. ఈ కారణాలతోనే జనసేన నేతల్లో గందరగోళం పెరిగిపోతోంది. మిత్రపక్షం విషయంలో అసలు పవన్ మనసులో ఏముందో కూడా తెలీటం లేదు. రెండు పార్టీల వరస చూస్తుంటే తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చేలోగానే రెండుపార్టీల మధ్య పొత్తు విషయం తేలిపోయేట్లుగానే ఉంది.