వండర్ అంటే ఇదే..మనుమరాలికి జన్మనిచ్చిన బామ్మ

Update: 2020-12-07 07:18 GMT
అమెరికాకు చెందిన ఓ వృద్ధురాలు తన కొడు5కుకోసం భారీ సాహసానికి పూనుకున్నది. కుమారుడి కోసం 59 ఏళ్ల మహిళ సరోగసి విధానంలో పాపకు జన్మనిచ్చింది. తన మనవరాలిని  తన గర్భంలోనే మోసింది ఈ మహిళ. ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎవరు ఎన్ని మాటలన్నా పట్టించుకోకుండా కొడుకు కోసం ఈ త్యాగానికి సిద్ధ పడింది.  అమెరికాలోని నెబ్రాస్కాకు చెందిన  సెసిల్ ఎలెజ్ కు ఓ కుమారుడున్నాడు. అతడి పేరు మాథ్యూ ఎలెజ్​ . కానీ మాథ్యూ గే. దీంతో అతడికి సంతానం ను పొందే అదృష్టం లేదు. కానీ బిడ్డను పెంచుకోవాలని, తన వారసత్వాన్ని నిలుపుకోవాలని ఎంతో ఆశ. ఇందుకోసం ప్రతిరోజూ  బాధపడేవాడు. అయితే అతడి బాధను అర్థం చేసుకున్న సెసిల్​ ఎలెజ్​ సరోగసి ద్వారా  బిడ్డను కనేందుకు ముందుకొచ్చింది.

కానీ ఈ వయసులో బిడ్డను కనడం సాధ్యమేనా అని వారి కుటుంబసభ్యుల్లో అనుమానాలు వచ్చాయి. దీంతో వైద్యులను సంప్రదించగా.. వారు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి సెసిల్​ ఎలేజ్​ సరోగసి ద్వారా బిడ్డను కనే అవకాశం  ఉందని నిర్ధారించారు. దీంతో వైద్యులు వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించారు. అయితే ఇందుకోసం మాథ్యూ తన స్పెర్మ్ అందించగా.. అతడి సహచరుడు ఎలియట్ సోదరి లియా అండాన్ని దానం చేశారు. దీంతో సెసిల్​ సరోగసి ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. చివరకు ఓ గే తన తల్లి ద్వారా బిడ్డను పొందాడు.

అమెరికాలో అక్కడి సుప్రీంకోర్టు గే ల వివాహాలకు చాలా ఏళ్ల  క్రితమే అనుమతి ఇచ్చింది. కానీ వారికి సంతానోత్పత్తి విషయం కొంత కష్టంగా మారింది. దీంతో చాలా మంది గేలు సరోగసి ద్వారాగా బిడ్డలను పొందుతున్నారు. అయితే గే అయిన కుమారుడి కోసం అతడి తల్లే సరోగసి ద్వారా బిడ్డను కనడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం అమెరికా మీడియాలో ప్రముఖంగా వచ్చింది.
Tags:    

Similar News