మోడీ ఆ వెబ్ సైట్ ను ఎందుకు తెరమీదకు తెచ్చారు?
దేశంలో పల్లె సీమల అభివృద్ధి కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ‘గ్రామ స్వరాజ్య’ పేరిట ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్, మొబైల్ యాప్ ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఈ రెంటినీ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన దేశంలోని పలు పంచాయతీలకు చెందిన సర్పంచ్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ స్వరాజ్య వెబ్ సైట్ ద్వారా దేశంలోని అన్ని గ్రామాలను కేంద్రంతో అనుసంధానించడం సాధ్యమవుతుందని, అన్ని పల్లె సీమల్లో జరుగుతున్న అభివృద్ధి, ఇతర కార్యక్రమాలపై అటు ప్రభుత్వాలతో పాటు ఇటు ప్రజలు కూడా సమగ్ర వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుందని కూడా మోదీ చెప్పుకొచ్చారు.
అయితే ప్రస్తుతం ప్రాణాంతక వైరస్ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ... గ్రామ స్వరాజ్య వెబ్ సైట్ ఏ రీతిన ఉపయోగపడుతుందన్న విషయాన్ని కూడా మోదీ ప్రస్తావించారు. గ్రామ స్వరాజ్యంలో అభివృద్ధే కాకుండా... ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల గురించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని, పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించే పంచాయతీల వివరాలను కూడా ఈ సందర్భంగా తెలుసుకోవచ్చని తెలిపారు. కరోనా వైరస్ గురించి గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. కరోనా వైరస్ మనకు ఎన్నో పాఠాలు నేర్పిందని, మనం పయనించే దారిలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో అత్మనిర్భరంతో ఉండాలని.. ఈ సమయంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండి మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎంత బలపడితే ప్రజాస్వామ్యం అంత బలపడుతుందని మోదీ చెప్పుకొచ్చారు. కష్టాలు ఎదురైనప్పుడు ఆత్మస్థైర్యంతో ముందకు సాగాలని పిలుపునిచ్చారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న జాగ్రత్తలపై సర్పంచులను అడిగి తెలుసుకున్నారు. కరోనా నివారణకు ఎనలేని కృషి చేస్తున్న సర్పంచులకు మోదీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కరోనాపై గ్రామ ప్రజలకు మరింత అవగాహన, చైతన్యం కలిగించాలని సూచించారు. గ్రామాల్లో సుపరిపాలనకు పంచాయతీ రాజ్ సంస్థ ఎంతగానో కృషిచేస్తోందని ప్రశంసించారు. ప్రస్తుతం లక్షా 15వేల గ్రామ పంచాయితీల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలు కొనసాగుతున్నాయని అన్నారు. గ్రామాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని, పారిశుద్ధ్యాన్ని నిర్వహించాలని సూచించారు. గ్రామ స్వరాజ్ ద్వారా బ్యాంకు రుణాలను కూడా సులభంగా పొందవచ్చిన ప్రధాని పేర్కొన్నారు.