ఎన్టీఆర్ వైద్య సేవ పెద్ద కుంభ‌కోణ‌మ‌ట‌

Update: 2017-01-22 05:57 GMT
విశ్రాంత ఐఎఎస్‌ అధికారి - రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఛాయారతన్ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఎన్టీఆర్‌ వైద్య సేవ పెద్ద కుంభ‌కోణమ‌ని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకాన్నే ఎన్టీఆర్ వైద్య‌సేవ‌గా మార్చి అందిస్తున్నార‌ని ఇదో పెద్ద కుంభకోణమని చాయార‌త‌న్ ఆరోపించారు. ప్రజాధనాన్ని కార్పొరేట్లకు ధారాదత్తం చేసేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని ఆమె ధ్వజమెత్తారు. విజయవాడలో ప్రజారోగ్య వేదిక - ప్రజా పర్యవేక్షణ కమిటీ - సిఆర్‌ ఎస్‌ డి - ఎపి బడ్జెట్‌ సెంటర్‌ సంయుక్తంగా ప్రజా సమాలోచన సదస్సులో ఛాయా రతన్‌ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు.

ఇన్సూరెన్స్‌ పథకాల ద్వారా కార్పొరేట్‌ ఆసుపత్రులకు అందుతున్న నిధులు - అక్కడ ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై బడ్జెట్‌ నిపుణులు - ప్రజా ఆరోగ్య ఉద్యమకారులు శాస్త్రీయమైన అధ్యయనాలు చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని చాయ‌ర‌త‌న్‌ పిలుపునిచ్చారు. రాష్ట్ర బడ్జెట్‌ లో వైద్య - ఆరోగ్య రంగానికి నాలుగు శాతం నిధులు కేటాయించాలని కోరారు. వైద్య ప‌థ‌కాల‌కు చేప‌డుతున్న బడ్జెట్‌ ప్రక్రియ అవినీతిగా మారిందని, కేటాయింపులకు, వాస్తవ ఖర్చులకు పొంతన ఉండటం లేదని విమర్శించారు. కేటాయింపుల‌కు, ఖ‌ర్చుకు, అందుతున్న సేవ‌ల‌కు మ‌ధ్య పొంతన లేద‌ని త‌ద్వారా ప‌థ‌కం ప‌క్క‌దారి ప‌ట్టింద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని చాయార‌తన్ పేర్కొన్నారు. ఈ విష‌యంలో ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఆమె సూచించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News