ఇండియాకు రావాలనుకునే ఎన్నారైలకు శుభవార్త!

Update: 2020-05-22 16:51 GMT
ఎన్నారైలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. విదేశాలలో చిక్కుకున్న వారిలో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసిఐ) కార్డుదారులకు దేశానికి రావడానికి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అనుమతి ఇచ్చింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం భారతదేశానికి రావడానికి అనుమతించబడిన వారికి కొన్ని ప్రత్యేక నిబంధనలు పెట్టింది. ఈ నిబంధనల ప్రకారం అర్హత పొందిన వారిని మాత్రమే ఇండియాకు రావడానికి అనుమతి ఇస్తుంది.

ఎవరెవరు అర్హులు

ఓసీఐ కార్డు ఉన్నవారే ప్రయాణానికి అర్హులు.

కుటుంబ అత్యవసర పరిస్థితుల అనారోగ్యం - మరణం వంటి అత్యవసరాలకు అనుమతిస్తారు.

విదేశాల్లో ఉన్న భారతీయులకు జన్మించిన వారు కూడా రావచ్చు.

విదేశీ విశ్వవిద్యాయాల్లో చదువుతూ చిక్కుకుపోయిన వారు. తల్లిండ్రులు ఇండియాలే ఉంటేనే వీరిని అనుమతిస్తారు.

ఈ అర్హతలున్న వారు ప్రభుత్వం ఏర్పాటుచేసిన విమానం, ఓడ.. ఏదైనా ఎంచుకోవచ్చు.



Tags:    

Similar News