గూగుల్ జీన్స్...వచ్చేశాయి

Update: 2017-02-24 17:17 GMT
గూగుల్...ఇంటర్నెట్ అనే పదానికి ప్రత్యామ్నాయంగా మారిపోయిన సంగతి తెలిసిందే. అయితే అంతర్జాలంపై తన పట్టు బిగించడంతో సరిపెట్టుకోకుండా కొత్త కొత్త వ్యాపారాల్లోకి గూగుల్ విస్తరిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో కొత్తగా జీన్స్ తయారీకి శ్రీకారం చుట్టింది. జీన్స్ పై యూత్ కు ఉన్న క్రేజ్ ని గుర్తించిన గూగుల్ సుపర్బ్ జీన్స్ ను మార్కెట్లోకి వదిలింది. దీనికి బాగానే రెస్పాన్స్ రావడం విశేషం.
 
ఇప్పటికే ఉన్న డిమాండ్ ను తట్టుకోవాలంటే రిచ్చుగా రంగంలోకి దిగాలని భావించిన గూగుల్ లేడీ గాగా, మిలే సిరస్ వంటి సెలబ్రిటీలతో సహా చాలామందికి ఔట్ ఫిట్లు డిజైన్ చేసిన క్రిస్టియన్ కొవాన్ అనే డిజైనర్ తో తీర్చిదిద్దిన కొత్త బ్లూజీన్స్ ను మార్కెట్లోకి వదిలింది. ఈయనతో పాటు ఫ్యాషన్ డిజైనర్లు జెరెమి స్కాట్, మైఖేల్ కొర్స్ తో రూపొందించిన జీన్స్ ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి. అందులోనూ గూగుల్ ప్రిక్సెల్ స్మార్ట్ ఫోన్ కి మ్యాచ్ అయ్యే తరహాలో ఈ ఔట్ ఫిట్స్ ఉండటం మరింత విశేషం.
 
యువతను ఆలోచనలకు అనుగుణంగా తమ జీన్స్ ను ప్రవేశపెట్టినట్లు గూగుల్ వివరిస్తోంది. తమ జీన్స్ గురించి గూగుల్ వివరిస్తూ ప్రపంచంలోనే అత్యుత్తమమైన, అసలైన బ్లూ జీన్స్ తమదేనని ఢంకా భజాయించి మరీ చెప్తోంది. అందుకే ఇప్పటికే అనేకమంది తమ జీన్స్ గురించి ఇంటర్నెట్లో చాలా మంది వెతికారని వివరిస్తోంది. త్వరలో మార్కెట్లో పట్టు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News