బంగారు టాయిలెట్ ను ఇలా దోచుకెళ్లారు..

Update: 2019-09-15 07:52 GMT
టాయ్ లెట్ అంటేనే వాక్ అంటారు.. పైగా అది చాలా సార్లు వాడేసింది.. ఆ కంపు దగ్గరకే చాలా మంది వెళ్లరు.. కానీ అది అలాంటి ఇలాంటి టాయ్ లెట్ అయితే అందరూ దానిపై దృష్టిసారించేవారు కాదు.. కానీ అది బంగారంతో తయారు చేసిన టాయ్ లెట్.. ఎప్పుడో బ్రిటీషర్ల కాలం నాటిది.. ప్రపంచ వారసత్వ కట్టడంలో నాడు రాజులు ఏర్పాటు చేసుకున్నది. మొత్తం బంగారంతో చేసుకున్న టాయ్ లెట్ అదీ.. దీంతో దొంగల కన్నుపడింది..

బ్రిటన్ లోని బ్లెన్ హీమ్ ప్యాలెస్  ప్రపంచ వారసత్వ కట్టడంగా పేరుగాంచింది. ఈ ప్యాలెస్ లో బంగారు టాయ్ లెట్ ఉంది. దీన్ని వాళ్లు అపురూపంగా కట్టుకున్నారు. తాజాగా దొంగలు ఈ బంగారు టాయిలెట్ ను దొంగలించారు. ఉదయం 4.50గంటలకు ఈ దొంగతనం జరిగిందని బ్రిటన్ పోలీసులు తెలిపారు.

దొంగలు ఉదయం ఎవరూ లేనిది చూసి చాకచక్యంగా గదిలోకి ప్రవేశించి ఈ బంగారు టాయ్ లెట్ ను పెకిలించుకొని తీసుకుపోయారు. రెండు వాహనాలు దీన్ని దొంగిలించడానికి నిందితులు ఉపయోగించినట్టు పోలీసులు తెలిపారు. ఇక బంగారు టాయ్ లెట్ ను పెకిలించేటప్పుడు గోడను, వాటర్ పైపును ధ్వంసం చేశారు దొంగలు..  దీంతో ఆ ప్రాంతమంతా నీటితో నిండిపోయింది.

ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని.. ఈ దొంగతనం కేసులో 66ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
Tags:    

Similar News