ఎట్టకేలకు తేల్చారయ్యా.. గ్రేటర్ పోలింగ్ 45.71 శాతం
ఎన్నికల వేళ.. మీడియా ప్రతినిధులకు టార్చర్ అంటే ఏమిటన్నది అనుక్షణం అర్థమయ్యేలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. టీవీ చానళ్ల దూకుడు.. సోషల్ మీడియాలో గోరంతను కొండంత చేసేలా పోస్టులు.. మొత్తంగా ప్రింట్ లో పని చేసే వారికి ఉండే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఎందుకంటే.. టీవీ చానళ్లలో బ్రేకింగ్ న్యూసులంటూ ఏమైనా అనేయొచ్చు. ఎంతైనా చూపించేయొచ్చు. ఆ క్షణం తర్వాత అది గాల్లో కలిసిపోతుంది. కాకుంటే.. ఇప్పుడు రికార్డు చేసుకునే ఆప్షన్ ఉన్నప్పటికీ.. ముందు టెలికాస్టు చేసిన వాటిని పెద్దగా పట్టించుకోరు. ఆ మాటకు వస్తే.. టీవీల్ని.. అందులోని వార్తాంశాల్నిసీరియస్ గా తీసుకునే తీరు అంతకంతకూ తగ్గుతుంది.
ఇక.. సోషల్ మీడియా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. టీవీ చానళ్లకు వందల రెట్లు దూకుడు ప్రదర్శిస్తూ.. ఎవరి బుర్రలో ఏం మెదిలితే.. అదే వార్తాంశంగా మారిపోయే దుస్థితి. దీంతో.. సోషల్ మీడియాలోని సమాచారానికి విశ్వసనీయత అన్నది పెద్ద ప్రశ్న. ఇదంతా ఎందుకంటే.. తాజాగా ముగిసిన గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ఎపిసోడే కారణం. పోలింగ్ ఎంత జరిగింది? అన్న విషయంపై ప్రాథమికంగా అందిన సమాచారాన్ని పట్టుకొని.. అదే ఫైనల్ అన్నట్లుగా ప్రచారం చేయటం తెలిసిందే.
నిన్న సాయంత్రం ఆరు గంటల వేళలో.. గ్రేటర్ పోలింగ్ అత్యల్పంగా 36 శాతానికే పరిమితమైనట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో.. గ్రేటర్ హైదరాబాదీయులు మరీ అంత బద్ధకస్తులా? అంటూ మండిపాటు మొదలైంది. ఎవరికి వారు.. వారికి తోచినట్లుగా పంచ్ ల మీద పంచ్ లు వేయటం షురూ చేశారు. తీరా చూస్తే.. మంగళవారం అర్థరాత్రి పన్నెండున్నర గంటల ప్రాంతంలో పోలింగ్ శాతం మీద అప్పటివరకు ఉన్న అంచనాల్ని సరిచేస్తూ.. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం.. మంగళవారం గ్రేటర్ వ్యాప్తంగా జరిగిన పోలింగ్ 45.71 శాతంగా తేల్చింది.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మంగళవారం సాయంత్రం ఐదు గంటల వేళకు 36.73 శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పగా.. గంట వ్యవధిలోనే 45.71 శాతం నమోదైనట్లుగా ప్రకటించటంపై పలువురు ఆశ్చర్యానికి గురవుతన్నారు. ఎందుకంటే.. చివరి గంటలో నమోదైన పోలింగ్ ఏకంగా 9 శాతం కావటం. ఆసక్తికరమైన మరో అంశం.. గత ఎన్నికలతో పోలిస్తే.. తాజా పోలింగ్ కాస్త ఎక్కువైనట్లే చెబుతున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం రామచంద్రాపురం డివిజన్ లో అత్యధికంగా 67.71 శాతం పోలింగ్ నమోదైతే.. అతి తక్కువగా యూసఫ్ గూడలో 33 శాతం మాత్రమే నమోదైంది. గ్రేటర్ లో పోలింగ్ జరిగిన 149 డివిజన్లలో (మరో డివిజన్ లో రీ పోలింగ్ కు ఆదేశించారు) శివారు డివిజన్లలోనే ఎక్కువ పోలింగ్ జరిగిందని చెబుతున్నారు.పోలింగ్ విషయంలో ఎన్నికల సిబ్బంది సరిగా నమోదు చేయకపోవటమే ఇలాంటి పరిస్థితికి కారణమని చెబుతున్నారు.