ఆ నాలుగు ఉంటే వారంలో పాస్ పోర్ట్

Update: 2016-01-28 11:30 GMT
పాస్ పోర్ట్ కోసం చాలామంది పడే పాట్లు అన్నిఇన్ని కావు. సరైన అవగాహన లేకపోవటం.. నిబంధనల కంటే కూడా దళారుల్ని నమ్మటం లాంటివి చాలామంది చేస్తుంటారు. అయితే.. ఇలాంటి ఇక్కట్లు అస్సలు అక్కర్లేదని.. నాలుగంటే నాలుగు పత్రాలు పాస్ పోర్ట్ అప్లికేషన్ ఫారానికి జత చేస్తే చాలు.. మీ చేతికి పాస్ పోర్ట్ వచ్చేస్తుందని చెబుతున్నారు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్. పాస్ పోర్ట్ జారీకి జరుగుతున్న జాప్యానికి చెక్ పెట్టేందుకు వీలుగా తాజాగా ఆమె ఒక కీలక వ్యాఖ్యను ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.

తాను పేర్కొన్న నాలుగు కీలక ధ్రువ పత్రాల్ని పాస్ పోర్ట్ అప్లికేషన్ కు జత చేస్తే.. వారం వ్యవధిలో పాస్ పోర్ట్ పొందటం ఖాయమని ఆమె పేర్కొంటున్నారు. తాను పేర్కొన్న నాలుగు ధ్రువపత్రాలకు సంబంధించిన నకళ్ల (జిరాక్స్) ను పాస్ పోర్ట్ అప్లికేషన్ కు జత చేయాలని సుష్మ సూచిస్తున్నారు.

సుష్మ చెప్పిన కీలకమైన ఆ నాలుగు ధ్రువ పత్రాలు ఏమంటే..

1.        ఆధార్ కార్డు

2.        ఓటరు గుర్తింపు కార్డు

3.        పాన్ కార్డు

4.        వ్యక్తిగత వివరాలు ధ్రువీకరించే అఫిడవిట్
Tags:    

Similar News