మగాళ్లు వాటిని పెట్టుకోవటానికి ఇష్టపడటం లేదట!!

Update: 2020-05-18 02:30 GMT
ఆసక్తికరమైన అంశం ఒకటి బయటకు వచ్చింది. తాజాగా నిర్వహించిన సర్వే.. ఈ విషయాల్ని వెల్లడించింది. లాక్ డౌన్ వేళ.. పరిమితుల మధ్య బతుకుతున్న వారిలో.. ఉల్లంఘనలకు పాల్పడే వారిలో మగాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. అంతేకాదు.. మాయదారి రోగం వ్యాపించకుండా ఉండేందుకు మాస్కుల వినియోగం తప్పనిసరి. దీని కారణంగా 50 శాతానికి పైగా ముప్పు తప్పే వీలుంది.

అయినప్పటికీ మాస్కులు ధరించేందుకు మహిళలతో పోల్చినప్పుడు మగాళ్లు ఆసక్తిని చూపటం లేదన్న విషయం బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు కూడా మాస్కులు ధరించకుండా ఉండటానికి కారణం ఏమిటన్న అంశం మీద లండన్ లోని మిడిల్ సెక్స్ వర్సిటీ.. కాలిఫోర్నియాలోని మాథమెటికల్ సైన్స్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లు చేపట్టిన సర్వేల్లో ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి.

ఇంతకీ మగాళ్లు మాస్కులు పెట్టటానికి ఆసక్తిని చూపించకపోవటం వెనుక కారణం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. తమకు ముప్పు తక్కువని భావించటం ప్రధాన కారణంగా చెబుతున్నారు. శాస్త్రీయంగా చూస్తే.. మహిళలతో పోలిస్తే.. మగాళ్లకే ముప్పు ఎక్కువ. పురుషుల రక్తంలో ఉండే ఎంజైమ్ కారణంగా మహిళలతో పోలిస్తే.. మగాళ్లపైనే అధిక ప్రభావాన్ని చూపిస్తుందని ఇప్పటికే తేలింది.
Tags:    

Similar News