నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ .. ముగ్గురు మృతి !

Update: 2021-05-11 08:30 GMT
నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని చండ్రపడియాలో ఈ రోజు ఉద‌యం ఓ కెమికల్ పరిశ్రమలో గ్యాస్‌ లీకైంది. ఈ ఘటన తో ఆ ఫ్యాక్టరీ లోని  ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. అలాగే అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన  వారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ లీకేజీకి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌రిశ్ర‌మ‌ల్లో త‌రుచూ గ్యాస్ లీక్ ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

గతంలో ఈ ఫ్యాక్టరీలో పలు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. ఇటీవల కాలంలో రియాక్టర్ పేలిన ఘటనలో నలుగురు  తీవ్రంగా గాయపడ్డారు.  ఈ రోజు ఉదయం  కార్మికులు విధులకు హాజరైన సమయంలో ఈ  ప్రమాదం జరిగింది. అయితే , ప్రమాదం జరిగిన  వెంటనే  ఫ్యాక్టరీ సిబ్బంది గ్యాస్ లీకేజీని అరికట్టారు. దీంతో పెద్ద ప్రమాదాన్ని నివారించారు. ఈ ప్రమాదంపై అధిాకరులు విచారణకు ఆదేశించారు. విచారణలో వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. గత ఏడాది మే మొదటివారంలో  విశాఖ జిల్లాలోని ఎల్జీ పాలీమర్స్ లో  గ్యాస్ లీకై  పలువురు మరణంచిన విషయం తెలిసిందే.
Tags:    

Similar News