ధోనీ త‌ప్పుకోవాలి... గంభీర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2019-07-19 10:35 GMT
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ గురించి గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లో ధోనీ ఆటతీరు అంచనాలను అందుకోలేదద‌న్నది వాస్తవం. కొన్ని కీలక మ్యాచ్ లో ధోనీ సరైన ఆట తీరు కనపర్చలేదు. ప్రపంచకప్ సెమీఫైనల్లో సైతం న్యూజిలాండ్ తో ధోనీ జిడ్డు ఆట ఆడటం వల్ల స్వల్ప తేడాతో ఓడిపోయింద‌న్న విమర్శలు కూడా వస్తున్నాయి.

ఈ ప్రపంచ కప్ భారత్ గెలిచాక ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరు అనుకున్నారు. భారత్ సెమీఫైన‌ల్లో ఓడిపోవడంతో ఇప్పుడు ధోనీ ఎలాంటి ? నిర్ణయం తీసుకుంటారన్నది అందరిలోనూ ఆసక్తిగా మారింది. ధోనీ రిటైర్ మెంట్ లాంఛనమే అయినా అటు ధోనీ నుంచి కానీ... ఇటు బీసీసీఐ నుంచి కానీ ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రపంచకప్ భారత్ విండీస్ పర్యటనకు వెళుతోంది.

విండీస్‌ పర్యటనకు భారత జట్టును శుక్రవారం ఎంపిక చేయాల్సి ఉన్న కెప్టెన్ కోహ్లి అందుబాటులో లేకపోవడంతో చివరి క్షణంలో జట్టు ఎంపిక వాయిదా పడినట్టు తెలుస్తోంది. విండీస్‌ పర్యటనకు వెళ్లే జట్టులో ధోనీకి చోటు దక్కుతుందా ? లేదా అన్న సస్పెన్స్ నెలకొంది. ఒకవేళ పక్కనపెడితే ధోనీ రిటైర్ మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ధోనీ రిటైర్ మెంట్ పై భారత మాజీ ఓపెనర్.. ఢిల్లీ బిజెపి ఎంపీ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

యువ క్రికెటర్లను దృష్టిలో ఉంచుకొని... భారత జట్టు భవిష్యత్ దృష్ట్యా ధోని రిటైర్మెంట్ ప్రకటించాలని చెప్పటం విశేషం. ఇక ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా అతడు జట్టు భవిష్యత్తు గురించే ఆలోచించే వాడిని చెప్పుకొచ్చాడు. గంభీర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
Tags:    

Similar News