• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  గబ్బర్ రిటర్న్స్.. శిఖర్...

గబ్బర్ రిటర్న్స్.. శిఖర్ సెంచరీతో చెన్నై చిత్తు!

By - Tupaki Desk
Update: 2020-10-18 04:10 GMT
ఆహా..ఎన్నాళ్లకెన్నాళ్లకు అసలు సిసలు శిఖర్ ధావన్ ని చూసి.. ఇది కదా.. అభిమానులు శిఖర్ నుంచి కోరుకుంది. భారీ లక్ష్యం ముందున్నా.. సహచర బ్యాట్స్ మెన్ ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా.. జట్టంతా కలసి తనమైన స్కోర్ చేయకున్నా శిఖర్ ఒక్కడే ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు. చివరి వరకూ గెలుపు మాదేననుకున్న చెన్నైకి   పరాభవం మిగిల్చాడు. ఐపీఎల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. అతడేమీ సిక్సులతో విరుచుకు పడలేదు. ఎప్పటిలా తన మార్క్ క్లాస్ ఆట తీరుతో గ్యాప్ దొరికితే చాలు బంతిని బౌండరీకి తరలిస్తూ ఏకంగా 14 ఫోర్లు, ఓ చక్కటి సిక్సర్ బాదాడు. మునుపటి ధావన్ ని తలపించాడు. చివర్లో కాస్త టెన్షన్ పడ్డా అక్షర్ పటేల్ బ్యాటింగ్ విన్యాసం ఢిల్లీ క్యాపిటల్స్ కి అద్భుత విజయాన్ని కట్టబెట్టింది. పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్ర స్థానానికి చేరింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 179 పరుగులు సాధించింది.సామ్‌ కరాన్‌  మొదట్లోనే డకౌట్ అయినా  డుప్లెసిస్‌-షేన్‌ వాట్సన్‌ జోడి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టింది. వారిద్దరూ  రెండో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  
వాట్సన్‌ 28 బంతుల్లో,(6 ఫోర్లు ) 36 పరుగులు చేశాడు. డుప్లెసిస్  (58; 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. అంబటి రాయుడు(45 నాటౌట్‌; 1ఫోర్‌, 4 సిక్స్‌లు)  రవీంద్ర జడేజా(33 నాటౌట్‌; 13 బంతుల్లో 4 సిక్స్‌లు) రాణించడంతో
సీఎస్‌కే 179 పరుగులు చేసింది. ధోనీ (3) మరోసారి విఫలం అయ్యాడు.

ఛేదనలో ఢిల్లీకి మొదట్లోనే షాక్ తగిలింది. దీపక్‌ చహర్‌ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతికే పృథ్వీ షా డకౌట్‌ అయ్యాడు. అజింక్యా రహానే(8) కూడా మరోసారి విఫలం అయ్యాడు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(23; 23 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌), స్టోయినిస్‌(24;14 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) కొద్ది సేపు పోరాడారు. ధావన్‌ కడ దాకా క్రిజులో ఉండి సెంచరీతో ఆకట్టుకున్నాడు.

 చెన్నైని ఆటాడిన అక్షర్ పటేల్

ధావన్ సెంచరీ చేసినా ఢిల్లీ చివర్లో కష్టాల్లో పడింది. చివరి ఓవర్లో ఢిల్లీకి 17 పరుగులు అవసరం కాగా జడేజా బౌలింగ్లో  మూడు సిక్సర్లు బాదాడు. ఏకంగా 5 బంతుల్లోనే 21 పరుగులు చేసి మ్యాచ్ ని రెండు బంతులు ఉండగానే ముగించాడు.

ధావన్ దంచుడు

ఈ మ్యాచ్ లో ప్రత్యేక ఆకర్షణ ధావనే. ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నా చివరి దాకా  ఆడాడు. రన్ రేట్ పడిపోకుండా దూకుడుగా ఆడాడు. బౌండరీలతోనే ధావన్ 62 పరుగులు సాధించాడు. మునుపటి ధావన్ కళ్ళముందు కదిలేలా బ్యాటింగ్ చేశాడు.
Tags:    
  • IPL 
  • IPL 2020 
  • IPL Matches 
  • IPL 2020 Updates 
  • IPL Latest Updates 
  • BCCI 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS