హెచ్1 బీ వీసా ఉన్న వారి పిల్లలకు ఉచిత విద్య

Update: 2020-01-23 07:00 GMT
అమెరికా కు ట్రంప్ అధ్యక్షుడియ్యాక వలసదారులకు కష్టాలు మొదలయ్యాయి. ట్రంప్ తీసుకొచ్చిన వచ్చిన సంస్కరణలతో భారతీయులతో సహా విదేశీయులకు అమెరికాలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో కత్తెర పడింది.

అమెరికాలో నివాసం ఉండే భారతీయుల భార్యలకు ఉద్యోగాలను అప్పట్లో ట్రంప్ కట్ చేశాడు. ఇక భారతీయుల పిల్లలకు వలస విధానాలతో ఉచిత విద్య దక్కకుండా చేశారు.

అయితే తాజాగా అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం ఒక కొత్త చట్టం చేసింది. హెచ్1 బీ వీసా ఉన్న విదేశీయుల పిల్లలకు కూడా న్యూజెర్సీలోని ఉన్నత విద్యాసంస్థల్లో ఉచిత విద్య అందిస్తూ చట్టం చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ ఫిల్ మర్ఫీ ఈ బిల్లు పై మంగళవారం సంతకం చేశారు. ఈ చట్టంతో ఇకపై న్యూజెర్సీ లో నివాసం ఉండే స్వదేశీ, విదేశీయులందరూ ఉచిత ఉన్నత విద్యకు అర్హులే.

న్యూజెర్సీ గవర్నర్ నిర్ణయంపై భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. పిల్లల విద్య ఉచితం చేసి ఆర్థికంగా వెసులుబాటు కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాలో ట్రంప్ సర్కారు వలస చట్టాలను కఠినం చేస్తున్న తరుణం లో న్యూజెర్సీ గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఎన్ఆర్ఐల పిల్లల భవిష్యత్తు కు ఈ నిర్ణయం దోహద పడనుంది.
Tags:    

Similar News