కిరాణా షాపుకు వెళ్లిన అమ్మాయి.. పొదల మాటుకు వెళ్లిందెందుకు?

Update: 2020-01-24 04:35 GMT
దిశ ఉదంతం ఇప్పటికీ దడ పుట్టిస్తోంది. తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతం దిశ ఘటనను గుర్తుకు వచ్చేలా చేసింది. సంచలనంగా మారిన ఈ ఉదంతంలో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా లోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ పెద్ద చర్చకు తావిచచింది అమీన్ పూర్ కు చెందిన పదహారేళ్ల అమ్మాయి ఉదంతం. ఒక దశలో మరో దిశ లాంటి ఘటన చోటు చేసుకుందన్న మాట వినిపించింది. ఇంటి దగ్గరి కిరాణాషాపు దగ్గర సామాన్లు తెచ్చేందుకు వెళ్లిన టీనేజర్ ను బలవంతంగా ఒకరు కారులో తీసుకెళ్లినట్లుగా తొలుత ప్రచారం జరిగినా.. వాస్తవం అందుకు భిన్నంగా ఉంది.కాస్తంత కన్ఫ్యూజింగ్.. మరికాస్త గజి బిజిగా ఉండే ఈ ఉదంతం లోకి వెళితే..

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మునిసిపాలిటీ పరిధి లోని వాణీ నగర్ శివారు లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన దంపతులు ఒక అపార్ట్ మెంట్ లో పని చేసేందుకు కుదిరారు. అమ్మమ్మ దగ్గర ఉండే ఆ దంపతుల కుమార్తె పది రోజుల క్రితం పేరెంట్స్ ను చూసేందుకు వచ్చింది. ఇక్కడి వరకూ అంతా ఓకే. గురువారం ఉదయం పది గంటల సమయంలో సదరు బాలిక సామాను తెచ్చేందుకు ఇంటి దగ్గరున్న కిరాణాషాపుకు వెళ్లింది. అక్కడే ఉన్న ఒక యువకుడి బైకు ఎక్కినట్లు గా తెలుస్తోంది. నగర శివారు లోని చక్రపురి ప్రాంతానికి చేరుకోగా.. కాసేపటికే అక్కడకు కారులో మరో ముగ్గురు యువకులు చేరుకున్నారు.

ఆమె దగ్గరి సెల్ ఫోన్ లాక్కొని దూరంగా విసిరేసి బంధించారు. నలుగురూ ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించినట్లు సమాచారం. అంతలోనే అటువైపు మరో కారు రావటంతో సదరు యువకులు పారిపోయారు. కిరాణాషాపుకు వెళ్లిన కుమార్తె ఎంతసేపటికి రాక పోవటం పై ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు ఆ అమ్మాయి ఫోన్ చేసి.. తనను ఎవరో బలవంతంగా తీసుకొచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లుగా చెప్పింది.

దీంతో కాలనీకి చెందిన పలువురు యువకులు ఆమెను వెతుకుతూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పొదల మాటున ఒంటి మీద బట్టల్లేకుండా ఉన్న బాధితురాలిని గుర్తించారు. డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వటం తో పోలీసులు వచ్చారు. షాక్ తో బిక్కుబిక్కుమంటున్న సదరు యువతికి బట్టలు ఇచ్చి బయటకు తీసుకొచ్చారు. తొలుత తనపై అత్యాచారం జరిగినట్లుగా సదరు యువతి చెప్పటంతో పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆమెను ఆసుపత్రి కి తరలించారు.

అయితే.. కొద్ది సేపటి తర్వాత మాత్రమ తన పై అత్యాచార యత్నం జరిగిందే తప్పించి.. అత్యాచారం జరగ లేదని యువతి చెప్పటం.. దీనికి తగ్గట్లే ఆమెపై ఎలాంటి లైంగిక అత్యాచారం జరగలేదని వైద్యులు నిర్దారించారు. కిరాణా షాపు వద్ద బైకు ఎక్కినట్లుగా భావిస్తుంటే.. కాదు తనను బలవంతంగా లాక్కొచ్చినట్లుగా బాధిత మహిల చెబుతోంది. కాలనీలో అలా బలంవంతంగా బైకు మీద తీసుకొస్తుంటే.. పెద్ద ఎత్తున అరుస్తారు కదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉదంతంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సంగారెడ్డి ఎస్పీ వెల్లడించారు.


Tags:    

Similar News