బాప్ రే.. నాలుగాకుల మొక్కకు రూ. 4 లక్షలు

Update: 2020-09-04 03:30 GMT
మన దగ్గర రూ. నాలుగు లక్షల  డబ్బు ఉంటే మనం ఎంతగా చెలరేగిపోతామో. కొందరైతే విందులు,  వినోదాలు, పబ్బులు,  పార్టీ లంటూ అది అయిపోయే వరకు నిద్రే  రాదు. మరికొందరైతే ఏ బైక్, మొబైల్లో కొంటారు. ఇలా వాళ్ళ వాళ్ళ ఆశలేముంటే అవి  తీర్చేసుకుంటారు. కానీ న్యూజిలాండ్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన వద్ద ఉన్న రూ.నాలుగు లక్షలతో నాలుగు ఆకులున్న ఓ అరుదైన రకానికి చెందిన మొక్కను వేలంలో సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. నాలుగాకులున్న మొక్కకు ఏకంగా  రూ.నాలుగు  లక్షల అని అందరూ  నోరెళ్లబెడుతున్నారు. ప్రత్యేకమైన రంగులో ఉండే అరుదైన జాతి 'పిలో డెండ్రాన్ మినిమా ' మొక్కను ఈ కామర్స్ వెబ్సైట్ అయినా' ట్రేడ్ మీ 'వేలానికి పెట్టింది. ఆన్లైన్లో ఈ మొక్క కొనుగోలు కోసం జనాలు భారీగా పోటీ పడ్డారు. దాన్ని సొంతం చేసుకోవడం కోసం శతవిధాలా  ప్రయత్నించారు. చివరకు ఓ అజ్ఞాత వ్యక్తి రూ. 4 లక్షలు చెల్లించి ఆ మొక్కను సొంతం చేసుకున్నాడు. వేలం లో అరుదైన జాతి మొక్క సొంతం చేసుకున్నానంటూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశాడు. అయితే ఆ మొక్కకు ఉండేది నాలుగు ఆకులే అయినా అద్భుతమైన పసుపు రంగులో అందరినీ ఆకర్షించేలా ఉన్నాయి. ఎటువంటి రంగులేని మొక్కలు వేగంగా ఎదుగుతాయి. కానీ వివిధ రంగులు ఉన్న మొక్కలు మాత్రం చాలా నెమ్మదిగా పెరుగుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 'పిలో డెండ్రాన్ మినిమా ' మొక్క కూడా చాలా నెమ్మదిగా పెరిగే రకం. అందుకే ఆ మొక్క కొనుగోలుకు  ఆన్లైన్ జామ్ అయ్యేలా జనాలు పోటీ పడ్డారు. ఆ మొక్కను సొంతం చేసుకున్న వ్యక్తి సంతోషం అంతా ఇంతా కాదు. శాస్త్రవేత్తలు హయ్యర్ ఆఫీసియళ్ళు ఈ మొక్కను తమ గార్డెన్లో పెంచుకునేందుకు ఆసక్తి ప్రదర్శిస్తుంటారు.
Tags:    

Similar News