జీహెచ్ఎంసీ కార్పొరేటర్లలో 72 మంది నేరచరితులు

Update: 2020-11-16 18:00 GMT
ఎన్నికల నిబంధన మేరకు అభ్యర్థులు పోటీ చేసే సమయంలో తమ నేర చరిత్రను అఫిడవిట్ లో పొందుపర్చడమే కాకుండా టీవీ, పత్రికల్లో ప్రకటన చేయాల్సి ఉంది. అయితే వీరెవరూ  మీడియా ద్వారా ఓటర్లకు తమ నేర చరితకు సంబంధించిన సమాచారం వెల్లడించడం లేదు.  

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో గెలుపొందిన వారిలో ఎక్కువగా నేర చరితులే ఉన్నారని ఫోరమ్ ఫర్ గవర్నన్స్ సంస్థ అప్పట్లో తెలిపింది. కొత్తగా ఎన్నికైన 119 మంది ఎమ్మెల్యేలలో 67మంది నేర చరితులు గెలుపొందారని ఆ సంస్థ వెల్లడించింది. వీరిందరిపై సివిల్, క్రిమనల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఆ సంస్థ  తెలిపింది.

టీఆర్ఎస్ తరఫున ఎన్నికైన 88మందిలో 44మందిపై, బీజేపీ నుంచి ఎన్నికైన ఒకే ఒక్కడు రాజాసింగ్ పై కూడా ఎన్నో కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. కూటమి నుంచి ఎన్నికైన 21మందిలో 16మందిపై, ఏఐఎంఐఎం తరఫున ఎన్నికైన ఏడుగురిలో ఆరుగురిపై కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ప్రకటించిది. ఇదంతా నాలుగేళ్ల కిందటి సర్వే తెలిపింది.

త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ మరోసారి నేర చరిత్రను బయటపెట్టింది ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ . హైదరాబాద్ కార్పొరేటర్ల నేరచరిత్రను వెల్లడించింది.

మొత్తం 72 మంది కార్పొరేటర్లపై కేసులుండగా.. 30 మందికి నేర చరిత్ర ఉంది. పార్టీల వారీగా చూస్తే.. టీఆర్ఎస్ 14, టీడీపీ 13, కాంగ్రెస్ 13, బీజేపీ 4, స్వతంత్రులు 11 మంది ఉన్నారని తెలిపింది. కేసులున్న వారిలో 8మంది మహిళా కార్పొరేటర్లు, ప్రస్తుత పాలకమండలిలో 20 మంది నేరచరిత్ర గల అభ్యర్థులు ఉన్నారని సంస్థ తెలిపింది.
Tags:    

Similar News