ఒక్క రోజులో పదివేల కోట్లు.. ఈ నష్టం ఎంతని చెప్పా‘‘లీ’’?
ఫారెస్ట్ లీ(44).. నాలుగు పదుల వయసులోనే సంపన్న వ్యాపారవేత్త అయ్యారు. సింగపూర్ గేమింగ్ బిలియనీర్.. మూడు నెలల్లో కోల్పోయిన మొత్తం ఎంత తెలుసా? రూ.70 వేల కోట్లపైనే.
ప్రజలంతా లాక్ డౌన్ లతో ఇళ్లకు పరిమితం అయిపోవడం, ముందుజాగ్రత్త లేదా భయం కొద్దీ ఆన్ లైన్ షాపింగ్ కు ప్రాధాన్యం ఇవ్వడంతో అన్ని దేశాల్లో జరిగినట్టే.. సింగపూర్ లోనూ కొవిడ్ కాలంలో ఆన్‌లైన్ షాపింగ్, గేమింగ్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆ అవకాశాన్ని ఫారెస్ట్ లీకి చెందిన సీ లిమిటెడ్ బాగా సొమ్ము చేసుకుంది. ఫారెస్ట్ లీ ఏకంగా సింగపూర్‌లో కెల్లా అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. అయితే ఈ ఘనత ఎంతోకాలం కొనసాగలేదు.
తీవ్రమైన పోటీ నేపథ్యం, స్టాక్ మార్కెట్ కుదేలు, ఇతర పరిణామాలతో ఆయన సంపద కరిగిపోతూ వస్తోంది. ఇందుకు కారణం స్టాక్ మార్కెట్ ఒడిదొడుకులు..పరిణామాలు ఊహాతీతంగా సాగే మార్కెట్ లో ఎప్పుడు ఎవరు డబ్బు చేసుకుంటారో? ఎప్పుడు ఎవరు సర్వం కోల్పోతారో తెలియని పరిస్థితి.
ఇప్పుడీ రెండో అంశమే లీ విషయంలో జరిగింది. రెండేళ్ల తర్వాత ఆయన కంపెనీ స్టాక్ ధరలు ధబేల్‌మని మునిగిపోయాయి. ఈ నష్టం ఇప్పట్లో రికవరీ అయ్యేలా కనిపించడం లేదు.
అసలేం జరిగింది?
టెన్సెంట్.. అందరికీ తెలిసిందే. చైనా గేమింగ్-ఈకామర్స్ దిగ్గజం అయిన ఈ సంస్థ. అయితే, సీ లిమిటెడ్ కంపెనీ వాటాలో కోత విధించింది. ఇది ఫారెస్ట్ లీకి తీవ్ర నష్టం కలుగజేసింది. గతేడాది అక్టోబరు నుంచి ఈ ప్రక్రియ మొదలైంది. అప్పటినుంచి జరుగుతున్న పరిణామాలు లీఆదాయంపై భారీగా దెబ్బకొట్టాయి.
ఆ నష్టం విలువ ఎన్నటికీ పూడలేని రూ.వేల కోట్లు. వాస్తవానికి లీ.. అక్టోబరులో అమెరికన్ డిపాజిటరీ రసీదులు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటి నుంచి సంపదను క్రమంగా కోల్పోతూ వస్తున్నాడు. ఈ తరుణంలో సీ కంపెనీ వాటాను 21 శాతం నుంచి 18 శాతానికి కోత విధించినట్లు మంగళవారం టెన్సెంట్ ప్రకటించింది. టెన్సెంట్ స్టాక్ ధరలు రెండేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో పతనం కావడమే ఇందుకు కారణం.
ఈ చర్యతో సీ కంపెనీ వోటింగ్ హక్కులు సైతం 10 శాతానికి పడిపోయింది. ఇక తాజా పరిణామంతో ఈ మూడు నెలల్లోనే ఫారెస్ట్ లీకి వాటిల్లిన నష్టం 10 బిలియన్ డాలర్లకు పైమాటేనని బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. అంటే భారత కరెన్సీలో 70 వేల కోట్ల రూపాయలకు పైమాటే.
ఒక్క మంగళవారమే 1.5 బిలియన్ డాలర్లు(పది వేల కోట్ల రూపాయలకు పైనే) లీ నష్టపోయాడు. ప్రస్తుతం ఫారెస్ట్ లీ సంపద 11.8 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీంతో సింగపూర్ ధనికుల జాబితాలో లీ మూడో స్థానానికి పడిపోయాడు. టెన్సెంట్ స్టాక్ ధరలు ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. ఈ ప్రభావంతో ఫారెస్ట్ లీకి వాటిల్లి నష్టం సైతం ఇప్పట్లో రికవరీ కాకపోవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.