బాబు నిర్ణ‌యాన్ని నిర‌సిస్తూ ఆందోళ‌న‌

Update: 2017-04-01 17:55 GMT
తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు ఊహించ‌ని నిర‌స‌న ఎదురైంది. వైసీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేల‌ను త‌న పార్టీలో చేర్పించుకున్న బాబు వారిలో కొంద‌రికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే దీనికి ఏపీలో కంటే ముందుగా తెలంగాణ నేత నుంచి ఆందోళ‌న ఎదురైంది. పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణం చేయించొద్దని కాంగ్రెస్ సీనియర్ నేత - మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) రాజ్‌ భవన్‌ ముట్టడికి యత్నించారు.

ఏపీలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ నేప‌థ్యంలో వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణం చేయించకూడదని వీహెచ్ డిమాండ్‌ చేశారు. గవర్నర్‌ ఈఎస్ ఎల్ నరసింహాన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఈ సందర్భంగా వీహెచ్‌ ఆరోపించారు. తెలంగాణలో చేసినట్టే ఏపీలో కూడా జంప్ జిలానీల‌తో ప్రమాణ స్వీకారం చేయిస్తే గవర్నర్‌ ను బర్తరఫ్‌ చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరతామని ఆయన తెలిపారు. అంతే కాదు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అవసరమైతే ఉద్యమం కూడా చేపడతామని వీహెచ్ హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి మెరుపు ధర్నా చేపట్టిన వీహెచ్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Tags:    

Similar News