మంత్రి ప‌ద‌వి రేసులో మాజీ మంత్రి: వైసీపీలో హాట్ టాపిక్‌!

Update: 2021-01-19 15:30 GMT
మ‌రో ఆరేడు మాసాల్లో మంత్రి వ‌ర్గాన్ని పున‌ర్వ్య‌వ‌స్థీక‌రించే అవ‌కాశం ఉన్న ఏపీలో ఇప్ప‌టి నుంచే మం త్రు లు ఎవ‌రికివారు ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో మంత్రి ప‌ద‌వుల రేసులో నేనున్నా న‌ని కొం ద‌రు.. నాకు ఖ‌చ్చితంగా వ‌చ్చితీరుతుంద‌ని మ‌రికొంద‌రు ఎవ‌రికి వారు ప్ర‌య‌త్నాలు చేసుకుం టున్నారు. ప్ర‌చారం కూడా చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో గ‌డిచిన రెండు వారాలుగా రాజ‌ధాని జిల్లా గుంటూరులో కొత్త పేరు తెర‌మీదికి వ‌చ్చింది. గ‌తంలో వైఎస్ హ‌యాంలో విద్యాశాఖ మంత్రిగా చ‌క్రం తిప్పిన ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద‌రావు.. గురించి హాట్ టాపిక్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

గుంటూరు జిల్లా తాడికొంద నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌తంలో గెలిచిన ఈయ‌న సీనియ‌ర్ రాజ‌కీయ నాయ ‌కుడు, ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావుకు ప్ర‌ధాన శిష్యుడిగా గుర్తింపు పొందారు. ఆయ‌న వెంటే ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయాల్లో నడిచారు. కాంగ్రెస్‌లో ఉన్నారు..త‌ర్వాత రాయ‌పాటి.. టీడీపీలోకి చేరితే.. ఆయ‌న వెంట టీడీపీలోకి వెళ్లారు. అయితే.. కొన్నాళ్ల కింద‌ట టీడీపీ నుంచి వైసీపీలోకి వ‌చ్చి చేరారు.  ఇప్పుడు ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో కొత్త ప్ర‌చారం ప్రారంభించార‌ని వైసీపీలో చ‌ర్చ న‌డుస్తోంది. త్వ‌ర‌లోనే జ‌గ‌న్ మంత్రి వ‌ర్గాన్ని ప్ర‌క్షాళ‌న చేస్తార‌ని.. అప్పుడు.. త‌న‌కు ఖ‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నార‌ట‌.

అయితే.. సామాజిక స‌మీక‌ర‌ణల రీత్యా చూసిన‌ప్పుడు.. గుంటూరు జిల్లాకు చెందిన ఎస్సీ నాయ‌కురాలు.. వైఎస్ కుటుంబానికి అత్యంత స‌న్నిహితురాలు.. మేక‌తోటి సుచ‌రిత‌.. మంత్రిగా ఉన్నారు. సో.. ఈ జిల్లా నుంచి ఇదే సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌రొక‌రికి అవ‌కాశం ద‌క్కే ఛాన్స్ లేదు. అయితే.. డొక్కా అనుచ‌రు లు చెబుతున్న విష‌యాన్ని బ‌ట్టి.. ఆమెను త‌ప్పిస్తార‌ని.. త్వ‌ర‌లోనే త‌మ నాయ‌కుడికి ప‌ట్ట‌క‌డ‌తార‌ని! ప్ర‌స్తుతం ఈ టాపిక్ గుంటూరులో తీవ్ర‌స్థాయిలో వినిపిస్తోంది. ఏ ఇద్ద‌రు క‌లిసినా.. డొక్కాకు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ‌మ‌రి ఈ ప్ర‌చారం ఏమేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.
Tags:    

Similar News