మాజీ ఉద్యోగికి 13 ఏళ్ల జైలు శిక్ష ... ఏంచేసాడంటే ?

Update: 2020-11-20 15:50 GMT
ఒక రిటైర్ ఉద్యోగికి 13 ఏళ్ల కఠిన జైలు శిక్ష ను విధించింది రష్యా ప్రభుత్వం . అయితే , ఓ మాజీ ఉద్యోగి పై ఈ విధమైన కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా బలమైన కారణం ఉందని ప్రభుత్వాధికారులు అంటున్నారు. దేశ మిలటరీ రహస్యాలను యూఎస్ ఇంటెలిజెన్స్ ఏజెంన్సీ (సీఐఏ), రష్యన్ ఫిడరల్ సిక్యూరిటీ సర్వీస్(ఎఫ్ ఎస్  ‌బీ)లకు అమ్మే ప్రయత్నం చేశాడని, ఆ కారణమగానే  అతడిపై ఇటువంటి కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.

 యూరీ ఈస్చెంకో 2015-2017 సంవత్సారలలో నార్తన్ ఫ్లీట్ వెస్సెల్ మెయింటనెనన్స్ అప్పజెప్పిన సంస్థలో పనిచేశాడని, ఆ సమయంలోనే  దేశ ఆయుధాలకు సంబందించిన రహస్యాలను దొంగలించాడని ప్రభుత్వం తెలిపింది.  అంతేకాకుండా 2019లో సీఐఏతో సంబందాలను పెట్టుకున్నట్లు తేల్చింది. అయితే ఇతడిని జులైలో రష్యా సింట్రల్ ‌లో రహస్యాలను సీఐఏకు ఇస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నాట్లు పోలీసులు వెల్లడించారు.  ‘2020 నవంబరు 17న బ్రయాన్స్క్ కోర్టులో యూరీ తన తప్పులను ఒప్పుకున్నాడు. దీనితో ఆ మాజీ ఉద్యోగి పై ఆర్టికల్ 275 ద్వారా కేసు నమోదు చేశాం. ఆ తరవాత  కోర్టు యూరీకి 13 సంవత్సరాల జైలు శిక్షను విధించిందని ఎఫ్ ఎస్ ‌బీ తెలిపింది.
Tags:    

Similar News