సామాన్యుడి శపధాన్ని పూర్తి చేసిన మోడీ
ఒక సామాన్యుడి శపధాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తించారు. అతగాడి దీక్షను ముగించేలా చేసిన ఆసక్తికర ఉదంతమిది. ఒక సామాన్యుడి విపరీతాభిమానాన్ని పిచ్చితనంగా వదిలేయకుండా.. దేశ ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి సానుకూలంగా స్పందించి.. అతని కోరికను తీర్చటంలో తోడ్పాటును ఇవ్వటమే కాదు.. అతగాడి శపధాన్ని పూర్తయ్యేలా చేశారు.
రాజస్థాన్ లోని బిల్వారాకు చెందిన బల్వంత్ అనే వ్యక్తికి నరేంద్ర మోడీ అంటే పిచ్చ అభిమానం. ఆయన కోసం ఏం చేసేందుకైనా సిద్ధం. అలాంటి ఆయన.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసేంతవరకూ చెప్పులు వేసుకోనని శపధం చేశాడు. రెండేళ్ల నుంచి అతగాడు తాను అనుకుంటున్నట్లే చెప్పులేసుకోకుండా తిరగసాగాడు.
చివరకు అతగాడి వివరాలు తెలుసుకున్న మోడీ.. తన దగ్గరకు పిలిపించుకున్నారు. ఇండో పసిఫిక్ ఐలాండ్ నేషన్స్ సదస్సులో పాల్గొనేందుకు జయపురాకు వచ్చిన మోడీకి.. బల్వంత్ ఉదంతం గురించి స్థానిక నేతలు చెప్పటం.. తనను అంతగా అభిమానించే అతగాడిని పిలిపించుకున్న ప్రధాని మోడీ అతని శపధాన్ని పూర్తి చేయించి.. అతన్ని చెప్పులేసుకోమనటం.. అతగాడు ఆనందంగా చెప్పులేసుకోవటంతో.. ఒక సామాన్యుడి శపధం పూర్తి అయింది. తన ప్రేమను మొండితనంగా మార్చుకున్నా.. అలాంటివాటిని పట్టించుకోని మోడీ.. తన అభిమాని కలను నెరవేర్చే ప్రయత్నం చేయటం గమనార్హం.