చిన్న దుకాణానికి ..గుండె ఆగి పోయేంత కరెంట్ బిల్లు!

Update: 2020-09-10 15:00 GMT
ఈ మధ్య కరెంటు వైర్ల కంటే కరెంట్ బిల్లులే తెగ షాకిస్తున్నాయి.  ఏవేవో కారణాలు చెప్పి ఏదోఒక విధంగా వాయించేస్తున్నారు. ఇంటికొచ్చిన కరెంట్ బిల్లులు చూస్తే గుండె ఆగి పోయేలా ఉంది పరిస్థితి. విద్యుత్ శాఖ అధికారుల తప్పిదాల కారణంగానే ఇటువంటివి జరుగుతున్నాయి. ఇటీవల ఒక బాలీవుడ్ ప్రముఖ హీరోకు  కూడా  తన కార్యాలయానికి వచ్చిన కరెంట్ బిల్లు చూసి బహిరంగంగానే ట్రాన్స్ కో పని తీరుపై విమర్శలు చేశారు. ఇలాగే రాజస్థాన్ కు చెందిన ఓ వ్యక్తికి ట్రాన్స్ కో దిమ్మ తిరిగే షాకిచ్చింది. వందలు, వేలు కాదు.. ఏకంగా రూ. 3.71 కోట్ల కరెంటు బిల్లు ఇంటికి పంపింది. ఆ బిల్లు చూడగానే అతడికి గుండె ఆగినంత పనైంది.

గింగ్లా గ్రామానికి చెందిన మనా రామ్ డంగీ వ్యవసాయం చేస్తుంటాడు. దాంతో పాటు చిన్న దుకాణాన్ని కూడా నిర్వహిస్తున్నాడు. ఆ దుకాణానికి గడిచిన నెలకు గాను  విద్యుత్ అధికారులు అక్షరాలా 3 కోట్ల 61 లక్షల 507 రూపాయల బిల్లు వేశారు. ఈ బిల్లును చూడగానే  మనా రామ్ షాక్ కు గురయ్యాడు. చిన్న దుకాణానికి రూ. కోట్లలో బిల్లు రావడం ఏంటి అని విస్తుపోయాడు. ఏదో తప్పు దొర్లినట్టు గ్రహించి వెంటనే విద్యుత్ అధికారులను కలసి బిల్లు చూపించాడు. సర్వర్ లో తలెత్తిన సమస్య కారణంగానే ఇంత బిల్లు వచ్చినట్లు అధికారులు వ్యాపారికి వివరించారు. నెలంతా అతడు వాడిన కరెంట్ కు వాస్తవంగా వచ్చిన బిల్లు రూ. 6400 గా నిర్ధారించి ఆ మొత్తాన్ని చెల్లించాలని సూచించారు. దీంతో అతడు ఆ బిల్లు వరకే చెల్లింపు చేసి అక్కడి నుంచి బయట పడ్డాడు.
Tags:    

Similar News