చిన్నమ్మకు సపోర్ట్ చేసిన నటుడి పరిస్థితేందంటే..

Update: 2017-02-26 04:47 GMT
తమిళనాడులో పరిస్థితులు మా సిత్రంగా తయారయ్యాయి. చిన్నమ్మకు సపోర్ట్ చేసే వారి పరిస్థితి దారుణంగా తయారవుతోంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న నటుడు కమ్ ఎమ్మెల్యే కరుణాస్ (తిరువాడాళై నియోజకవర్గం) చిన్నమ్మకు మద్దతుగా నిలిచారు. ఆయన తీరుపై నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అమ్మమరణం తర్వాత ఏర్పడిన పరిణామాల్లో ఆయన.. చిన్నమ్మ పక్షాన నిలిచారు. అదే ఇప్పుడాయనకు మహా ఇబ్బందికరంగా మారింది.

ఈ నెల 22న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ను తప్పు పట్టేవారు.. వ్యతిరేకించే వారు మరింత దుందుడుకుగా వ్యవహరించారు. ఆయన పుట్టిన రోజున నాడు ఒక పోస్టర్ ను భారీగా గోడలకు అంటించేశారు. ఇందులో కరుణాస్ ఫోటోకు ఆయన సతీమణి గ్రేస్ కన్నీటి అంజలి ఘటిస్తున్నట్లుగా ఉంది. ఈ పోస్టర్లను చూసిన తన భార్యకు గుండెపోటు వచ్చిందని.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కరునాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువాడాళై నియోజకవర్గ ప్రజలు సైతం కరుణాస్ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తన నియోజకవర్గానికి వెళ్లిన ఆయనపై.. అక్కడి వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. మరోసారి నియోజకవర్గానికి వస్తే.. తిరిగి వెళ్లవంటూ వార్నింగ్ ఇవ్వటం ఇప్పటికే సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై కరుణాస్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. భావ స్వాతంత్ర్యం పేరిట తనను కించపరిచే విధంగా ప్రయత్నిస్తున్నారని.. తనను కించపరిచే వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరుతున్నారు. చిన్నమ్మకు సపోర్ట్ గా నిలుస్తున్న ఎమ్మెల్యేలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారనటానికి కరుణాస్ ఉదంతం ఒక ఉదాహరణనని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News