బ్రేకింగ్ : జీహెచ్ఎంసిలో వరద సాయం బంద్ !

Update: 2020-11-18 16:30 GMT
హైదరాబాద్ లో గత కొన్ని రోజుల క్రితం , తెలంగాణ లో గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరం మొత్తం చెరువును తలపించింది. భారీ వరదల కారణం ఎంతో మంది అనేక విధాలుగా నష్టపోయారు. వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం వరదసాయాన్ని ప్రకటించింది. అయితే, తక్షణమే ఈ వరద సాయం నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో వరదసాయం కోసం దరఖాస్తుల స్వీకరణ, పంపిణీని నిలిపివేయాలని ఎస్ ఈసీ సూచించింది.

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరవాత నష్టపరిహార పథకాన్ని యధావిధిగా కొనసాగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్వర్వుల్లో వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే వరద సాయంపై పలు రాజకీయ పార్టీల నుంచి అనేక ఫిర్యాదులు అందాయని, ఎన్నికల సమయంలో వరద సాయం చేయడం వల్ల ఓటర్లను ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఆయా పార్టీ నేతలు చెప్పడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఇకపోతే , హైదరాబాద్ వరద బాధితులు ప్రభుత్వం ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు గత కొన్ని రోజులుగా నానా కష్టాలు పడుతున్నారు. ఆయా ప్రాంతాల్లోని మీ-సేవ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో ప్రజలు ఉండడం, కొన్ని చోట్ల సర్వర్ డౌన్, మరికొన్ని చోట్ల బంద్ ఉండడంతో ఇక్కట్లు పడుతున్నారు.
Tags:    

Similar News