వరద బీభత్సం .. నీళ్లల్లో మునిగిపోయిన గ్రామం..!
ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం సృష్టించింది. వర్షం దెబ్బకు కొండ చరియలు విరిగిపడి పోతున్నాయి. అనుకోకుండా వచ్చిన ఈ ప్రకృతి విపత్తుతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటివరకు ఎంత మంది గల్లంతయ్యారో? ఎంత మంది చనిపోయారో? కూడా అధికారులకు లెక్క తెలియడం లేదు. సహాయక బృందాలు కూడా వరద ముప్పు ఉన్న గ్రామాల్లోకి వెళ్లలేకపోతున్నాయి. అయితే ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో వరద ముప్పు ఎక్కువగా ఉంది. రేణి వద్ద డ్యామ్ కూడా కూలిపోయింది.
అయితే రేణీ అనే ఓ గ్రామం పూర్తిస్థాయిలో మునిగిపోయింది.
అయితే సహాయక బృందాలు అక్కడికి చేరుకొని వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు.
ప్రస్తుతం ధౌలి నదికి ఉప్పొంగి ప్రవహిస్తున్నదని అధికారులు అంటున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని జిల్లా మేజిస్ట్రేట్ తెహ్రీ శివ్ చరణ్ ద్వివేది పేర్కొన్నారు.
హరిద్వార్ జిల్లాలోని ప్రజలను కూడా అధికారులు అలర్ట్ చేశారు. ముఖ్యంగా నదీ పరివాహన ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఈ విషయంపై చమోలి పోలీసు సూపరింటెండెంట్ యశ్వంత్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ… ప్రస్తుతం వరద ముప్పుతో చాలా నష్టం వాటిల్లిందని చెప్పారు. ఎంతమంది చనిపోయారో చెప్పలేకపోతున్నామని అన్నారు.
ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ .. అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ముంపు ప్రాంతాల్లో వెంటనే సహాయక కార్యకలాపాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.