జగన్ లెక్క అదిరింది - తొలి జీవో రిలీజ్
అచ్చం తండ్రిలాగే మొదటి సంతకంతో వైఎస్ జగన్ పేదల మనసు దోచుకున్నారు. వృద్ధాప్య పింఛన్లను 2000 నుంచి 2250 కి పెంచుతూ చేసిన మొదటి సంతకం అధికారికంగా అమల్లోకి తేవడానికి ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం తొలి జీవోను విడుదల చేసింది. ఈ జీవో విడుదలతో ఇక నుంచి వృద్ధులు, వితంతుల పింఛన్లను రూ.2,250 పెరిగాయి. వికలాంగుల పింఛన్ రూ.3 వేలకు, కిడ్నీ వ్యాధిగ్రస్థుల పింఛన్ రూ.10 వేలకు పెరగనుంది.
ఇక వృద్ధాప్య పింఛన్ వయస్సును కూడా ఈ జీవో ద్వారా తగ్గించారు. ఇక నుంచి పింఛను పొందే అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు కుదించారు. పెంచిన పింఛన్లు జులై 1 నుంచి ప్రజలకు అందుతాయి. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రచారం మొదలుపెట్టింది. ఒక పింఛను దారు చంద్రబాబు పాలనలో ఐదేళ్లకు గాను 64 వేలు అందుకున్నారు. అయితే, రాబోయే ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం ద్వారా అదే మనిషికి 1,65,750 రూపాయలు పింఛనుగా అందనుంది కొత్త లెక్క చెప్పారు. అంటే పెంచుకుంటూ పోయేదానిని లెక్కించుకుంటే కలిగే లబ్ది ఇది. లెక్క అదిరింది. మొత్తం సొమ్ము చూస్తే ఐదేళ్లలో లక్షన్నరకు పైగా ఓ వ్యక్తికి పింఛనుగా రావడం అంటే మాటలు కాదు. లెక్క అదుర్స్ కదూ.