హెచ్ 1బీ వీసాల కోసం తొలిసారి రెండోసారి లాటరీ
డాలర్ డ్రీమ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా చెప్పే హెచ్ 1బీ వీసాకు సంబంధించి తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు భారత్ కు మేలు జరగటమే కాదు.. గడిచిన కొద్ది రోజులుగా నిరాశలో ఉన్న వారికి కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించేలా మారాయని చెప్పాలి. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఒకే ఏడాదిలో రెండుసార్లు లాటరీ వేసే పరిస్థితి తాజాగా చోటు చేసుకుంది. ట్రంప్ సర్కారు తీసుకున్న మార్పుతో పాటు.. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు ఇందుకు కారణంగా చెప్పొచ్చు.
2021 మార్చి కోసం ఇప్పటికే లాటరీ విధానంలో హెచ్ 1బీ వీసాలు జారీ చేయటం తెలిసిందే. దాదాపుగా 2.67 లక్షల అప్లికేషన్లు పెట్టుకోగా లాటరీని నిర్వహించిన అభ్యర్థుల్ని ఎంపిక చేశారు. వీరంతా ఏప్రిల్ నుంచి జూన్ మధ్యన దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హెచ్ 1బీ వీసాకు సంబంధించి ప్రతి ఏటా భారత్ కు 85వేల వీసాల్ని అమెరికా జారీ చేస్తుంది. అనుకోని రీతిలో కరోనా వచ్చి పడటం.. ట్రంప్ సర్కారు తీరుతో.. వీసాకు అప్లికేష్లు పెట్టుకోవాల్సిన వారు పెట్టుకోని పరిస్థితి.
దీంతో.. నిర్ణీతి కోటా కూడా పూర్తికాని పరిస్థితి. మామూలుగా అయితే.. వీసా అవకాశం లభించిన వెంటనే.. దరఖాస్తు పెట్టేసుకోవటం ఉండేది. కరోనా భయంతో చాలామంది ఈసారి వెనక్కి తగ్గిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. మొన్నటివరకు వీసా దరఖాస్తుల మీద నిషేధం విధించిన ట్రంప్ సర్కారు.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటంతో.. హెచ్ 1బీ వీసాల జారీకి అవకాశం కలిగింది.
వీసా కోటాను పూర్తి చేసేందుకు అవసరమైన దరఖాస్తులు రాకపోవటంతో.. ఈ ఏడాది మరోసారి లాటరీని నిర్వహించిన అర్హులైన వారిని ఎంపిక చేస్తారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదని.. ఇదే తొలిసారిగా చెబుతున్నారు. తాజా పరిణామం భారతీయ టెకీలకు వరంగా మారుతుందని చెబుతున్నారు. ఈ ఏడాదికి డాలర్ డ్రీమ్స్ మీద ఆశలు వదిలేసుకోవాలనుకున్న వారందరికీ తాజా పరిణామం సంతోషాన్ని ఇస్తుందని చెప్పక తప్పదు.